
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.చతుర్దశి రా.12.56 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం: ధనిష్ఠ రా.11.14 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.5.47నుండి 7.28 వరకు, అమృత ఘడియలు: ప.12.50 నుండి 2.24 వరకు, శ్రీఅనంతపద్మనాభ వ్రతం.
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.08
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృషభం: ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.
మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాల విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.
కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
సింహం: మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఉద్యోగప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
కన్య: నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.
తుల: లేనిపోని వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
వృశ్చికం: ఇంటర్వ్యూలు అందుతాయి. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
మకరం: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.
కుంభం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
మీనం: పనుల్లో పురోగతి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.