ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత | Today Telugu Horoscope On May 30th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత

May 30 2025 5:28 AM | Updated on May 30 2025 8:31 AM

Rasi Phalalu: Daily Horoscope On 30-05-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.చవితి రా.1.28 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పునర్వసు రా.1.39 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ప.1.58 నుండి 3.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు, తదుపరి ప.12.21 నుండి 1.12 వరకు, అమృత ఘడియలు: రా.11.26 నుండి 1.02 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.29, సూర్యాస్తమయం: 6.26. 

మేషం... ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం... వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మిథునం.... కొత్త పనులు చేపడతారు. బంధువుల కలయిక. విందువినోదాలు. ప్రయత్నాలు అనుకూలం. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం... కొత్త వ్యక్తుల పరిచయం. ఆహ్వానాలు రాగలవు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య... పరిచయాలు పెరుగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

తుల... పనులు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

వృశ్చికం... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు... కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

మకరం... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

కుంభం... రుణఒత్తిడులు. ఇంటాబయటా  సమస్యలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు.

మీనం... రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement