గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.తదియ రా.2.22 వరకు, తదుపరి చవితి,నక్షత్రం: అశ్విని రా.3.03 వరకు, తదుపరి భరణి,వర్జ్యం: రా.11.16 నుండి 12.47 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.22 నుండి 7.48 వరకు, అమృత ఘడియలు: రా.8.06 నుండి 9.38 వరకు.
సూర్యోదయం : 6.07
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. మిత్రులతో వివాదాలు తీరతాయి. భూములు,వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. బంధువుల కలయిక. విలువైన వస్తువులు చేజారవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ తప్పదు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.
మిథునం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలో కొత్త హోదాలు.
కర్కాటకం: సోదరుల కీలక సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
సింహం: కొన్ని పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం, ఔషధసేవనం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కన్య: ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యవహారాలలో అవాంతరాలు. బంధువిరోధాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
తుల: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం: కొన్ని వివాదాల పరిష్కారం. శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో అనుకూలం. వాహనయోగం.
ధనుస్సు: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
మకరం: రుణఒత్తిడులు. ఆలయ దర్శనాలు.పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు కలిసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాల లో చికాకులు.విద్యార్థుల యత్నాలు ఫలించవు.
కుంభం: పాత మిత్రులను కలుసుకుంటారు. పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.
మీనం.. నూతన ఉద్యోగప్రాప్తి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజకనం. సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు.


