గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: అమావాస్య ఉ.7.05 వరకు, తదుపరి చైత్ర శుద్ధ పాడ్యమి తె.5.58 వరకు (తెల్లవారితే శుక్రవారం), నక్షత్రం: ఉత్తరాభాద్ర తె.5.12 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ప.2.56 నుండి 4.31 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.09 నుండి 10.57 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు, అమృత ఘడియలు: రా.12.21 నుండి 1.55 వరకు, ఉగాది, వసంత నవరాత్రులు ప్రారంభం.
సూర్యోదయం : 6.09
సూర్యాస్తమయం : 6.06
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో ఆస్తి వివాదాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ప్రయాణాలు..
వృషభం... ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిçస్తుంది.
మిథునం.... కొత్త పనులు చేపడతారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. విద్య, ఉద్యోగావకాశాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటకం.... కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి,వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. అనారోగ్యం. శ్రమకు తగిన ఫలితం కనిపించదు.
సింహం.... కొన్ని పనులలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.
కన్య...... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పనుల్లో విజయం. వాహనయోగం. ప్రముఖుల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు.
తుల.... దూరపు బంధువుల నుంచి ఉపయుక్త సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కీలక నిర్ణయాలు.
వృశ్చికం... ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలోæ చికాకులు. అనుకోని ధనవ్యయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహం, వాహనాల కొనుగోలులో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళం.
ధనుస్సు.... ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. శ్రమ తప్పదు. పనుల్లో కొంత జాప్యం. ఆస్తుల వివాదాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు మరింత పెరుగుతాయి.
మకరం... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ధన, వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకర సంఘటనలు.
కుంభం.... శ్రమాధిక్యం. కొన్ని పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. బంధువులతో విరోధాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో మాటపడతారు.
మీనం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో పురోగతి. శుభవార్తలు అందుతాయి. నూతన విద్యావకాశాలు. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.


