
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.దశమి రా.3.04 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఉత్తర ఉ.5.32 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: ప.2.41 నుండి 4.25 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.43 వరకు, తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు, అమృతఘడియలు: రా.1.07 నుండి 2.53 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.27.
మేషం.... రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృషభం... కార్యక్రమాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అప్పులు చేస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు.
మిథునం... రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో ఆటంకాలు.
కర్కాటకం..... ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు,స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
సింహం..... కార్యక్రమాలలో అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కన్య.... చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు.
తుల... మీ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. ఆధ్యాత్మిక చింతన.
వృశ్చికం... అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో లక్షా్యలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు.
ధనుస్సు.... కార్యక్రమాలు చకచకా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.
మకరం..... కాంట్రాక్టర్లకు నిరాశ తప్పదు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులతో అకారణ వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం.. కుటుంబంలో చికాకులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం...... కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.