ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం | Today Telugu Horoscope On June 4th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం

Jun 4 2025 5:42 AM | Updated on Jun 4 2025 9:57 AM

Rasi Phalalu: Daily Horoscope On 04-06-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు; జ్యేష్ఠ మాసం; తిథి శు.నవమి రా.1.40 వరకు, తదుపరి దశమి; నక్షత్రం: ఉత్తర పూర్తి (24 గంటలు); వర్జ్యం: ప.11.28 నుండి 1.11 వరకు; దుర్ముహూర్తం: ఉ.11.35 నుండి 12.27 వరకు; అమృత ఘడియలు: రా.9.50 నుండి 11.33 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు; యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు; సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.27 

మేషం... ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీ కృషిని మెచ్చుకుంటారు. విద్యాకాశాలు దక్కుతాయి. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.

వృషభం... శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

మిథునం.. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల నుంచి పిలుపు. నిర్ణయాలు అందరూ సమర్థిస్తారు. వ్యాపారాలు వృద్ధి బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

సింహం.... చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో కలహాలు. అనారోగ్య సూచనలు. మీపై కొన్ని బాధ్యతలు పడవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కన్య.... ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తుల తగాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల.... రాబడికి మించిన ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం..... కొత్త మిత్రులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎంతోకాలంగా ఉన్న ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం.... మిత్రులు మీపై ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

మీనం... సన్నిహితుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement