Rasi Phalalu: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి | Today Telugu Horoscope On June 10th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి

Jun 10 2024 6:39 AM | Updated on Jun 10 2024 9:55 AM

Horoscope Today: Rasi Phalalu On 10-06-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.చవితి సా.4.48 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పుష్యమి రా.10.35 వరకు, తదుపరి ఆశ్రేష, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.17 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు, అమృతఘడియలు: ప.3.55 నుండి 5.36 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.29. 

మేషం: కుటుంబంలో వివాదాలు, సమస్యలు. ధనవ్యయం. శ్రమా«ధిక్యం.  వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

మిథునం: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: త్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగయత్నాలలో అనుకూలత. ఆలయాలు  సందర్శిస్తారు.

సింహం: ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కన్య: పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి  మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

తుల: ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో కీర్తి దక్కుతుంది.  ఆహ్వానాలు రాగలవు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

వృశ్చికం: దూరప్రయాణాలు. రుణఒత్తిడులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాలలో  మార్చుకుంటారు. అదనపు ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనుస్సు: శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు.  బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

కుంభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు.  వ్యవహారాల్లో విజయం. పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.  

మీనం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement