
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.ద్వాదశి ఉ.11.22 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: హస్త రా.11.55 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: ఉ.6.54 నుండి 8.41 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.06 నుండి 12.53 వరకు, అమృతఘడియలు: సా.5.24 నుండి 7.09 వరకు.
సూర్యోదయం : 6.05
సూర్యాస్తమయం : 5.23
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం.... సోదరులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
వృషభం... ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
మిథునం.... వ్యవహారాలలో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కర్కాటకం.... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. మిత్రులు, బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.
సింహం... ప్రయాణాలు వాయిదా. ఇంటాబయటా చికాకులు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలలో కొన్ని మార్పులు. ఉద్యోగాలలో సమస్యలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.
కన్య... నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థికాభివృద్ధి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.
తుల.... రుణాలు చేస్తారు. శ్రమా«ధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు ఫలితం కనిపించదు.
వృశ్చికం..... బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆలయ దర్శనాలు. ఆస్తిలాభం. మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి. వస్తులాభాలు.
ధనుస్సు... ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. బంధువులతో సఖ్యత. దైవదర్శనాలు.. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
మకరం.... ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు మరింత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
కుంభం... కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒత్తిళ్లు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం... నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment