కడప–రేణిగుంట నేషనల్‌హైవే పనులు త్వరలో ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కడప–రేణిగుంట నేషనల్‌హైవే పనులు త్వరలో ప్రారంభం

Mar 13 2025 12:42 AM | Updated on Mar 13 2025 12:39 AM

రాజంపేట: ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోని కడప–రేణిగుంట నేషనల్‌హైవే (716) పనులు త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డురవాణా, హైవే మంత్రి నితిన్‌ జైరాం గడ్కారీ హామీ ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి బుధవారం ఇక్కడి విలేకర్లకు తెలిపారు. రాజ్యసభలో కడప–రేణిగుంట జాతీయరహదారి మంజూరై రెండేళ్లు అయిందని ప్రశ్నోత్తరాల సమయంలో అంశాన్ని ప్రస్తావించామన్నారు .ఇందుకు కేంద్రమంత్రి సమాధానంలో భాగంగా త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారన్నారు. ఈ నేషనల్‌హైవే నిర్మాణానికి సంబంధించి మొదటి దశ అటవీశాఖ నుంచి క్లియరెన్స్‌ వచ్చిందన్నారు. వన్యప్రాణులు ఎకోసెన్సిటివ్‌ జోన్‌ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుందన్నారు. వైల్డ్‌లైఫ్‌ అనుమతులు వచ్చాక ఎన్‌హెచ్‌ నిర్మాణానికి మార్గం సుగమవుతుందన్నారు. రెండు ప్యాకేజీల్లో రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. కడప–చిన్నఓరంపాడు, చిన్నఓరంపాడు–కడపల వారీగా నాలుగురోడ్ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. త్వరగా వైల్డ్‌లైఫ్‌ అనుమతులు వచ్చేలా కేంద్రం త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు.

బహిరంగవేలం:

రూ.21.93 లక్షల ఆదాయం

కలికిరి: కలికిరి గ్రామ పంచాయతీకి సంబంధించి వారపుసంత, దినసరి కూరగాయల మార్కెట్‌, ప్రైవేట్‌ బస్టాండ్‌, మాంసం దుకాణాలకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. దీనివల్ల పంచాయతీకి గరిష్టంగా రూ. 21.93లక్షల ఆదాయం సమకూరినట్లు డీఎల్‌పీఒ నాగరాజు తెలిపారు. వారపుసంతకు రూ.16లక్షలు, దినసరి కూరగాయల మార్కెట్‌కు రూ.3లక్షలు, ప్రైవేటు బస్టాండ్‌కు సంబంధించి రూ.2.03 లక్షలు, మాంసం దుకాణాలకు రూ.90వేలు, మొత్తం 21.93 లక్షలు ఆదాయం రాగా గత ఏడాది 15.23 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చింది. సర్పంచ్‌ ఎల్లయ్య, ఈఓ అశోక్‌, యోగేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి హామీ ఇచ్చారు

ఎంపీ మేడా రఘునాథరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement