కమలా హ్యారీస్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు | YS Jagan Mohan Reddy Wishes To Kamala Harris | Sakshi
Sakshi News home page

కమలా హ్యారీస్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

Nov 8 2020 11:08 AM | Updated on Nov 8 2020 2:50 PM

YS Jagan Mohan Reddy Wishes To Kamala Harris - Sakshi

సాక్షి, అమరావతి : అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన డెమొక్రాటిక్‌ పార్టీ నాయకురాలు కమలా హ్యారీస్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ట్విటర్‌ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘‘ డెమొక్రాట్లు కానీ, రిపబ్లికన్లు కానీ, రాజకీయాల సంగతి పక్కన పెడితే.. భారత మూలాలు కలిగిన కమలా హ్యారీస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు గర్వంగా ఉంది. కమలా హ్యారీస్‌కు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటంతో పాటు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ( చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌)

కాగా, ఒక మహిళ, ఒక ఆసియన్‌ అమెరికన్‌కు ఉపాధ్యక్ష పదవి దక్కడం ఇదే తొలిసారి. కమలా హ్యారీష్‌ ఇంతకుముందు ఎన్నో ఘనతలు సాధించారు. శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement