సాక్షి,తాడేపల్లి: చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆర్‌బీ చౌదరి మరణంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆర్‌బీ చౌదరి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని వైఎస్ జగన్ గుర్తుచేశారు. కుటుంబ సమేతంగా చూసే విధంగా మంచి కథలతో, విలువలతో కూడిన చిత్రాలను అందించడం ఆయన ప్రత్యేకత అని అన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్‌బీ చౌదరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు వైఎస్ జగన్.


