అనంత కలెక్టర్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు | Union Minister Javadekar Praises Collector Gandham Chandrudu | Sakshi
Sakshi News home page

అనంత కలెక్టర్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు

Oct 21 2020 8:15 AM | Updated on Oct 21 2020 1:21 PM

Union Minister Javadekar Praises Collector Gandham Chandrudu - Sakshi

కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంటున్న శ్రావణి (ఫైల్‌)  

సాక్షి, అనంతపురం ‌: అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 11న ‘బాలికే భవిష్యత్‌’ పేరుతో జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ నుంచి ప్రశంసలు దక్కాయి. కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆ రోజు జిల్లా కార్యాలయ అధికారులుగా బాలికలకు అవకాశం కల్పించడంపై కేంద్ర మంత్రి స్పందించారు. ఒక రోజు కలెక్టర్‌గా ఇంటర్‌ విద్యార్థిని ఎం.శ్రావణితో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఒక రోజు అధికారులుగా బాలికలు పనిచేశారు. దీనిపై కేంద్ర మంత్రి ట్విటర్‌ వేదికగా అభినందించారు. బాలికలకు ఇలాంటి అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించడం స్ఫూర్తిదాయకమని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement