తెలుగు ప్రజలకు వైఎస్ జగన్‌ ఉగాది శుభాకాంక్షలు | Ugadi Greetings from Y.S. Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్‌ ఉగాది శుభాకాంక్షలు

Mar 18 2026 4:17 PM | Updated on Mar 18 2026 8:20 PM

 Ugadi Greetings from Y.S. Jagan Mohan Reddy

సాక్షి, తాడేపల్లి: శ్రీ పరాభవ నామ సంవత్సరాది.. ఉగాది సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అన్నారు.

కాగా, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రేపు (మార్చి 19న) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
Ugadi: తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్షలు 

 

Advertisement
 
Advertisement
Advertisement