నేడు శాసన సభ ప్రత్యేక సమావేశం | Special session of the Legislative Assembly today | Sakshi
Sakshi News home page

నేడు శాసన సభ ప్రత్యేక సమావేశం

Mar 28 2026 2:20 AM | Updated on Mar 28 2026 2:20 AM

Special session of the Legislative Assembly today

రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ విభజన చట్టంలో చేర్చాలని తీర్మానం

సాక్షి, అమరావతి: శాసన సభ ప్రత్యేక సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు జరగనుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. విభజన చట్టంలోని సెక్షన్‌–5లో ‘ఏపీ రాజధానిగా అమరావతి’ అనే పదాన్ని చేర్చాలని కోరనున్నారు. 

ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే చట్ట సవరణ చేయాలని అభ్యర్థించనున్నారు. ఇదిలా ఉండగా శాసన సభను సమావేశపరచి శాసన మండలిని సమావేశపరచక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement