
ఆత్మహత్యాయత్నం చేసిన వెంకటరమణ
తాము కుదిర్చిన పెళ్లి చేసుకోకుండా తన కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
మదనపల్లె టౌన్ : తాము కుదిర్చిన పెళ్లి చేసుకోకుండా తన కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు, ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం మేరకు.. ములకలచెరువు మండలం పెద్దపల్లెకి చెందిన దంపతులు డి.వెంకటరమణ(50), మల్లమ్మ మగ్గం నేసి జీవనం సాగిస్తున్నారు.
వారి కుమార్తె కాల్వపల్లె పంచాయతీకి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న వెంకటరమణ కుమార్తెను మందలించి, కర్ణాటక రాష్ట్రం చేలూరుకు సమీపంలోని బేగంవారిపల్లెకి చెందిన బంధువుల యువకుడితో ఈ నెల 12, 13 తేదీల్లో వివాహం నిశ్చయించారు. కాగా ఆ యువతి రెండు రోజుల క్రితం ముస్లిం యువకుడితో వెళ్లి వివాహం చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంకటరమణ అవమానంగా భావించి వ్యవసాయ పంటకోసం తెచ్చుకున్న ఫ్లొరైడ్ గుళికను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు.