గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై సీఎం జగన్‌ ట్వీట్‌

CM Jagan Says Preparations In Full Swing For AP Global Summit - Sakshi

సాక్షి, తాడేపల్లి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ట్వీట్‌ చేశారు.  మార్చి 3, 4 తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో దీనికోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయని పేర్కొన్నారు. సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నామని  తెలిపారు. త్వరలోనే అందరినీ కలిసేందుకు ఎదురు చూస్తున్నామని చెప్పారు.

మరోవైపు విశాఖలో వచ్చే నెల 3, 4వ తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)–2023 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబ­డులు పెట్టడం వల్ల కలిగే లాభాల గురించి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది. ఇందుకోసం అడ్వాంటేజ్‌ ఏపీ పేరుతో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయడమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న వస­తులు, పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే ప్రయో­జనాల గురించి ఇన్వెస్టర్లకు వివరించింది.
చదవండి: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌: ఏపీతో ఎంతో లాభం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top