వైఎస్‌ జగన్‌: హ్యాపీ బర్త్‌డే తారక్‌ | YS Jagan Birthday Wishes to KTR - Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే తారక్‌: సీఎం జగన్‌

Jul 24 2020 11:44 AM | Updated on Jul 24 2020 5:02 PM

AP CM YS Jagan Wishes TS Minister KTR On His Birthday - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్‌)కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రియమైన నా సోదరుడు తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు  మీకు ఆరోగ్యాన్ని, అంతులేని సంతోషాలను ప్రసాదించాలి’’అని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఇందుకు స్పందించిన కేటీఆర్‌.. ‘‘ధన్యవాదాలు అన్నా’’ అని బదులిచ్చారు.(కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువ)

అదే విధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని కూడా ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో నిమగ్నమై యువతలో స్ఫూర్తి నింపుతున్న మీకు అన్ని సంతోషాలు దక్కాలి అని ఆకాంక్షించారు. కాగా శుక్రవారం కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా  రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ మంత్రి, కేటీఆర్‌ బావ హరీష్‌ రావు, టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌, మెగాస్టార్‌ చిరంజీవి తదితరులు కేటీఆర్‌ను విష్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement