CM YS Jagan Birthday: ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్‌గా #HBDYSJagan

AP CM YS Jagan Birthday 2022: HBDYSJagan Hashtag Trending In Twitter - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ట్విటర్‌లో ఇండియాలోనే టాప్‌ ట్రెండింగ్‌గా వైఎస్‌ జగన్‌ బర్త్‌డే ఉంది. #HBDYSJagan అనే హ్యాష్‌ ట్యాగ్‌తో అభిమానులు దేశ, విదేశాల నుంచి ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4లక్షల ట్వీట్లు దాటాయి.

ఇందులో భాగంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్న­దానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. రెడ్‌క్రాస్‌ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ట్విటర్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజుకు సంబంధించి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఇంతకుముందే వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

కృతజ్ఞత చాటుకుంటున్న ప్రజలు..
దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే నెరవేర్చారు. మూడున్నరేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రూ.1,77,585.51 కోట్లను జమ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా నాన్‌ డీబీటీ రూపంలో రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి ఇప్పటివరకు రూ.3,19,227.86 కోట్లను అందించారు.

వివిధ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సగటున 89 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. దీంతో లబ్ధిదారులు గత రెండు రోజులుగా జరుగుతున్న సీఎం జన్మదిన వేడుకల్లో భారీగా పాల్గొంటున్నారు. తద్వారా సీఎం వైఎస్‌ జగన్‌కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోమవారం నిర్వహించిన క్రీడల పోటీల్లోనూ.. మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమంలోనూ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చదవండి: (సీఎం జగన్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top