విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

బెళుగుప్ప: మండల పరిధిలోని నక్కలపల్లికి చెందిన ఈశ్వర్‌రెడ్డి (55) విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నక్కలపల్లికి చెందిన జి.ఈశ్వర్‌రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసుకున్న మోటార్‌ను ఆన్‌ చేసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే విద్యుత్‌ తీగలు కొంత తెగిపోయి ఉండటాన్ని గమనించకుండా ఎడమచేతితో పట్టుకుని ఆన్‌చేయగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన బెళుగుప్ప పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఈశ్వర్‌రెడ్డి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ వన్నూరస్వామి తెలిపారు. కుటుంబ యజమాని ఉన్న ఫలంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement