బీఎల్‌ఓలకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఓలకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

ఎన్యుమరేషన్‌ విషయంలో బీఎల్‌ఓలపై వస్తున్న ఫిర్యాదులపై ఈఆర్‌ఓలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించాం. బీఎల్‌ఓ లకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని చెప్పాం. 2002లో ఓటరు ఎక్కడ ఉన్నారనే వివరం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ తనకు ఓటు లేకపోతే వారి నాన్న లేదా తాత ఓటు ఎక్కడ ఉండేదనే విషయం చెప్పినా సరిపోతుంది. కచ్చితంగా ఈ వివరాలే ఇవ్వాలని, లేదంటే మీ ఓటు ఉండదు అంటూ ఓటర్లను బీఎల్‌ఓలు ఇబ్బంది పెట్టకూడదని గట్టిగా హెచ్చరించాం. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యుమరేషన్‌ ఫారం సమర్పించాలి.

– ఎ.మలోల, జిల్లా రెవెన్యూ అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement