పచ్చ నేతల కన్ను | - | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల కన్ను

Dec 10 2025 7:46 AM | Updated on Dec 10 2025 7:46 AM

పచ్చ

పచ్చ నేతల కన్ను

పచ్చని పల్లైపె
గలగల పారే సెలయేటి సవ్వడులతో చల్లని ఆహ్లాదకరమైన నదీ పరీవాహక ప్రాంత గ్రామం అది. ఒకపక్క పచ్చని పొలాలతో కళకళలాడుతూ.. మరోపక్క సుద్ద కొండ ఒడిలో ఒదిగి ఉన్న అందమైన గ్రామం. పెద్దలంతా వ్యవసాయం చేస్తూ చెరకు, వరి, ఇతర ఆహారధాన్యాలు పండిస్తూ ప్రజలకు తిండిగింజలు అందిస్తుంటే.. ఇక్కడ యువత దేశ రక్షణ విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ వంటి త్రివిధ దళాల్లో ఉద్యోగం చేస్తూ దేశరక్షణలో సైనికులుగా పనిచేస్తున్నారు. అలాంటి పచ్చని బెన్నవోలు గ్రామంపై అధికార పార్టీ నేతలు కన్నేశారు.ఈ గ్రామాన్ని ఆనుకొని విలువైన సుద్దకొండ ఉండడమే ఇందుకు కారణం.

చోడవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నదులు, కొండలు, ఇసుక, రాయి, చెట్టు చేమ ఏదీ వదలకుండా యథేచ్ఛగా దోపిడీ జరుగుతోంది. తాజాగా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి ఆనుకొని ఉన్న సుద్దకొండపై గ్రానైట్‌ మాఫియా కన్ను పడింది. దీనికి స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిరామిక్స్‌ తయారీ (ఫ్లోరింగ్‌ టైల్స్‌)లో ప్రధాన ముడిసరుకుగా వాడే సుద్ద గనుల కొండ ఇక్కడ ఉంది. ఇక్కడి సుద్దకొండను తవ్వేసుకొని లక్షలాది టన్నులు తరలించుకుపోయేందుకు స్కెచ్‌ వేశారు. ఈ సుద్దను తవ్వుకొని, అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించాలనే వారి ఆలోచన బెన్నవోలు గ్రామానికి ముప్పు తెచ్చేలా మారింది. వ్యవసాయంతో పచ్చని పొలాల మధ్య పెద్దేరు నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం ఇప్పుడు కొండమట్టి, బుగ్గిలో కాలుష్యం కోరల్లో మగ్గిపోయేలా ఉంది. ఈ గ్రామంలో సుమారు 20 కుటుంబాలు ఈ సుద్దకొండలో బండను చేత్తో తవ్వుకొని దానిని ముగ్గుపిండిగా తయారు చేసి గ్రామాల్లో తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనేక శతాబ్దాలుగా ఇదే వారికి జీవనాధారం. ఇప్పుడు ఈ సుద్దకొండను గ్రానైట్‌ మాఫియా యంత్రాలతో తవ్వుకుపోతే ఈ కుటుంబాలకు పూర్తిగా జీవనాధారం పోయి వారంతా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. దీంతో గ్రామమంతా ఇప్పుడు ఈ సుద్ద తవ్వకాలకు అనుమతులు ఇవ్వవద్దంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

అడ్డగోలుగా అనుమతులు

బెన్నవోలు సుద్దకొండను ప్రస్తుతానికి 17 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష్మీనర్సింహ మెటల్స్‌, శాండ్‌ ఇండస్ట్రీ ప్రైవేటు లిమిటెడ్‌ అనే గ్రానైట్‌ సంస్థకు ఈ సుద్ద కొండను తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. సుద్దకొండ పై భాగాన ఉన్న గ్రావెల్‌ మట్టిని 4 లక్షల 60 వేల మెట్రిక్‌ టన్నులు తొలగించి, దాని కింద ఉన్న తెల్ల సుద్దను 3 లక్షల 60 లక్షల మెట్రిక్‌ తవ్వుకోవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పైన తవ్విన గ్రావెల్‌ మట్టిని ఊరికి ఆనుకొని ఉన్న అదే కొండ భాగాన వేసేందుకు నిర్ణయించారు. ఈ విధంగా తవ్వకాలు చేస్తే గ్రావెల్‌ మట్టి భారీ వర్షాలకు కొట్టుకు వచ్చి ఊరిలో ఇళ్లపైకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మిషనరీతో తొలగించిన తెల్లసుద్ద వేస్ట్‌ అంతా కొండ గెడ్డల ద్వారా దిగువన ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి మేటలు వేస్తే పూర్తిగా పంటభూములు పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ తవ్వకాల వల్ల పచ్చని వాతావరణంతో ఉన్న ఈ గ్రామమంతా దుమ్ము ధూళితో కాలుష్యమైపోయి ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. గ్రామానికి ఆనుకొని ఈ కొండ ఉండటం వల్ల గాలి, నీరు కూడా కలుషితమైపోతుందంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో ప్రజలు ముక్తకంఠంతో చెప్పారు. అయినా సుద్దకొండ తవ్వకాలు జరిపేందుకు మాత్రం చాపకింద నీరులా అధికారిక పనులన్నీ జరిగిపోతున్నట్టు తెలిసింది. అధికార పార్టీ పెద్ద నాయకుల అండదండలతో టెండరు దక్కించుకున్న క్వారీ సంస్థ రాజకీయ బలంతో ఈ సుద్దకొండను తవ్వి పట్టుకుపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుపోతోంది. ఇదే గాని జరిగితే బెన్నవోలు గ్రామంలో ప్రజలు తిరుగుబాటు చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు.

పోరాటానికి సిద్ధం

పచ్చని గ్రామాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. గ్రావెల్‌, సుద్ద తవ్వేయడం వల్ల అదంతా మా ఊరుపైకి వచ్చి పూర్తిగా కలుషితం అవుతుంది. సుద్దకొండకు ఆనుకునే మా ఊరు, పంట పొలాలు ఉన్నాయి. అవన్నీ దెబ్బతిని మా జీవనం అంతా దుర్భరంగా మారుతుంది. ఎంతటి పోరాటానికై నా సిద్ధంగా ఉన్నాం.

– కంచిపాటి గంగాధర్‌, మాజీ సైనికుడు, బెన్నవోలు

కాలుష్యం కబళిస్తుంది

సుద్ద కొండను క్వారీ చేసి తవ్వుకొని పోయేందుకు ప్రభుత్వం లీజు ఉత్తర్వులు ఇవ్వడాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. దీని వల్ల గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయి. తవ్విన కొండమట్టి అంతా మా ఊరుపైకి, పొలాల్లోకి వచ్చి మేటలు వేస్తుంది. పంటలు నాశనమై కరువు నెలకొంటుంది.

– కంచిపాటి రమేష్‌, రైతు, బెన్నవోలు

పొట్ట కొట్టవద్దు

తాతల కాలం నుంచి గ్రామంలో ఉన్న సుద్దకొండే మా జీవనాధారం. కొండ నుంచి సుద్దను తవ్వుకొని ముగ్గుగా తయారు చేసి ముగ్గుపిండిని తట్టలతో ఊర్లంబడి తిరుగుతూ అమ్ముకొని జీవిస్తున్నాం. అలాంటిది ఇప్పుడు ఈ కొండను ఎవరో పెద్దోళ్లు వచ్చి మిషన్లతో తవ్వేసి సుద్ద పట్టుకుపోతే మాకు ఉపాధి ఏముంటుంది? – వి.లక్ష్మి,

ముగ్గు పిండి అమ్ముకునే మహిళ, బెన్నవోలు

అందమైన కొండను తవ్వేసి ...ప్రజల నెత్తిన బుగ్గి పోసే యత్నం

బెన్నవోలు సుద్దకొండకు

తూట్లు పొడిచేందుకు పన్నాగం

అధికార పార్టీ నాయకుల అండతో

తవ్వకాలకు టెండర్‌

తమ బతుకులు బుగ్గిపాలు

చేయవద్దంటున్న బెన్నవోలు గ్రామస్తులు

ప్రజాభిప్రాయాన్ని పక్కనపెట్టి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే యోచనలో ప్రభుత్వం

పచ్చ నేతల కన్ను1
1/6

పచ్చ నేతల కన్ను

పచ్చ నేతల కన్ను2
2/6

పచ్చ నేతల కన్ను

పచ్చ నేతల కన్ను3
3/6

పచ్చ నేతల కన్ను

పచ్చ నేతల కన్ను4
4/6

పచ్చ నేతల కన్ను

పచ్చ నేతల కన్ను5
5/6

పచ్చ నేతల కన్ను

పచ్చ నేతల కన్ను6
6/6

పచ్చ నేతల కన్ను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement