స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించిన భూముల పరిశీలన
నక్కపల్లి: మండలంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములను ఆ కంపెనీకి చెందిన జపాన్ బృందం మంగళవారం పరిశీలించింది. చందనాడ అమలాపురం డీఎల్ పురం ప్రాంతాల్లో ఈ బృంద సభ్యులు పరిశీలించారు. కేటాయించిన భూముల్లో కంపెనీ వారు స్వాధీనం చేసుకునేందుకు ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. అలాగే ఏపీఐఐసీ ఏర్పాటు చేస్తున్న కనెక్టివిటీ రోడ్డు పనులు ఈ బృందం పరిశీలించింది. కేటాయించిన మొత్తం భూములు మ్యాప్ ద్వారా పరిశీలించారు. అలాగే ఇదే గ్రామాల్లో కలెక్టర్ విజయ కృష్ణన్ కూడా పరిశీలించారు. మౌలిక సదుపాయాలు కల్పించే పనులు చూశారు. పురోగతి తెలుసుకున్నారు. వీరి వెంట నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, ఏపీఐఐసీ అధికారులు ఉన్నారు.


