నాణ్యమైన వైద్యం పేదలకు అందని ద్రాక్షే
అరకులోయటౌన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల నాణ్యమైన వైద్యం పేదలకు అందని ద్రాక్షగానే మిగులుతుందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని మాడగడ పంచాయతీ ఎం.హట్టగుడలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సామాన్యులకు నాణ్యమైన వైద్యం, నిరుపేద విద్యార్థులకు వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్‌పరం చేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నట్టు చెప్పారు. కూటమి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేతోపాటు పార్టీ నాయకులకు గిరి మహిళలు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, సర్పంచ్‌లు పాడి రమేష్, కొర్రా రాధిక, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, స్వాభి రామచందర్, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు రామ్మూర్తి, పల్టాసింగ్ విజయ్‌కుమార్, మాడగడ పీసా కమిటీ అధ్యక్షుడు మండియకేడి బాలరాజు, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి జన్ని నరసింహ మూర్తి, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, యువజన విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు ఎల్.బి. కిరణ్‌కుమార్, పార్టీ మండల కార్యదర్శి సోనియ, నాయకులు కొర్రా అర్జున్, కిల్లో జగన్, బి.బి. కామేష్, బేసు, శ్రీరాములు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
నాణ్యమైన వైద్యం పేదలకు అందని ద్రాక్షే


