ఏజెన్సీలో విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. పాఠశాలలు తెరిచి దాదాపుగా పదిహేడు రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల నియామకంపై దృష్టి సారించలేదు. ఇందుకు రంపచడోవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ 272 మంది విద్య | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. పాఠశాలలు తెరిచి దాదాపుగా పదిహేడు రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల నియామకంపై దృష్టి సారించలేదు. ఇందుకు రంపచడోవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ 272 మంది విద్య

Jul 3 2025 5:14 AM | Updated on Jul 3 2025 5:14 AM

ఏజెన్

ఏజెన్సీలో విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్

రంపచోడవరం: ఏజెన్సీ ప్రధాన కేంద్రం రంపచోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఐటీడీఏకు కూతవేటు దూరంలో ఉన్న ఈ పాఠశాలను పట్టించుకోకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 272 మంది విద్యార్థులు ఉన్నారు. పూర్తిస్థాయిలో సబ్జెక్ట్‌ టీచర్లు లేకపోవడంతో చదువులు ఎలా సాగుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రు్లు ఆందోళన చెందుతున్నారు.

కీలకమైన ఆ రెండు సబ్జెక్ట్‌లకు..

ఉన్నత పాఠశాలలో 22 మంది ఉపాధ్యాయులకు ఐదుగురు ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ మాత్రమే ఉన్నారు. తెలుగు రెండు పోస్టులు, హిందీ రెండు, లెక్కలు రెండు, ఫిజికల్‌ సైన్సు రెండు, బయాలజీ రెండు, ఇంగ్లీషు ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఐదుగురు ఉపాధ్యాయుల్లో తెలుగు, హిందీ టీచర్లకు ఇటీవల బదిలీ కాగా వీరు కూడా ఇక్కడ డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. కొద్దిరోజుల్లో వీరు కూడా తిరిగి వెళ్లిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇద్దరు ఆరు నుంచి టెన్త్‌ వరకు బోధిస్తున్నారు. అలాగే ఇంగ్లీషు, సోషల్‌ టీచర్లు ఇద్దరు పిరియడ్లు సర్దుబాటు చేసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు.

● పాఠశాల తెరిచిన నాటి నుంచి విద్యార్థులకు ఫిజికల్‌ సైన్సు, బయాలాజీ సబ్జెక్టుల బోధన ప్రారంభం కాలేదు.కీలకమైన లెక్కలు సబ్జెక్టు చెప్పే వారు లేరు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు లెక్కలు, ఫిజికల్‌ సైన్సు ఇప్పటి నుంచే బోధిస్తేనే పరీక్షలు నాటికి సిద్ధమవుతారు. ఖాళీ తరగతుల బాధ్యత స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎస్సీ ఫలితాలు విడుదలైన తరువాతైనా పోస్టులు భర్తీ అవుతాయో లేదో అనేది వేచి చూడాల్సిందే. టెన్త్‌ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కనీసం సబ్జె క్టు టీచర్లను డిప్యూటేషన్‌పై నియమిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మ్యాథ్స్‌తోపాటు సైన్స్‌

ఉపాధ్యాయులు కరువు

272 మంది విద్యార్థులకు ఐదుగురు మాత్రమే టీచర్లు

రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత

పాఠశాలలో 15 సబ్జెక్ట్‌ టీచర్‌ పోస్టుల ఖాళీ

బోధన సాగక విద్యార్థులు,

తల్లిదండ్రుల ఆవేదన

దృష్టి పెట్టని విద్యాశాఖ అధికారులు

పూరిగుడిసెల్లో ఆరు పాఠశాలలు

జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి ఆవేదన

రంపచోడవరం మండలంలో ఇమ్మడివరం, పందిరిమామిడి, గోగుమిల్లి, దిరిసినపల్లి, బీరంపల్లి, చెరువుపాలెం గ్రామాల్లో పూరిగుడిసెల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారని స్థానిక జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి బుధవారం కాకినాడలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ సమావేశంలో అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆరు పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ. 40 లక్షలు నిధులు మంజూరు కాగా భవనాలు 90శాతం పూర్తి చేశారు. ఇంకా టైల్స్‌, తలుపులు, వంటి చిన్న చిన్న పనులు ఉన్నాయి. వాటిని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని మూడు జిల్లా పరిషత్‌ సమావేశాల్లో కోరిన అధికారులు పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలకు ఐటీడీఏ నుంచి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఈ దిశగా తీసుకున్న చర్యలు కానరావడం లేదు. వర్షాలు కారణంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పూరిగుడిసెల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.

లెక్కల పాఠాలు ఎప్పుడు చెబుతారో..

పాఠాల తెరిచిన నాటి నుంచి లెక్కలు, సైన్సు పాఠాలు చెప్పడం లేదు. ఇలా అయితే మా చదువులు ఎలా ముందుకు సాగుతాయి. ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి పాఠాలు బోధించాలి. పదో తరగతిలో మంచి మార్కులు సాధించాలంటే ఇప్పటి నుంచి పాఠ్యాంశాలపై పట్టుసాధించాలి. ఉపాధ్యాయులు లేకుండా ఏం చేయలేం.

– లక్ష్మీకాంత్‌రెడ్డి, టెన్త్‌ విద్యార్థి

పట్టించుకోని అధికారులు

పాఠశాల తెరిచి ఇప్పటికి 17 రోజులు గడుస్తోంది. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో పాఠాలు జరగడం లేదు. బాగా చదువుకోవాలంటే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి. ఇటువంటి వాతావరణం తమ పాఠశాలలో లేదు. త్వరగా టీచర్లను నియమించాలని విద్యాశాఖ అధికారులను కోరుతున్నా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు.

– వి హేమనాగశ్రీ, టెన్త్‌ విద్యార్థిని

ఏజెన్సీలో విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్1
1/1

ఏజెన్సీలో విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement