
ప్రజల్లోకి చంద్రబాబు మోసాలు
అరకులోయ టౌన్: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా జిల్లా కేంద్రం పాడేరులో ఈనెల 4న నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ జిల్లాస్థాయి విస్తృత సమావేశానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు తరలిరావాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆరు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొంటారన్నారు. సీఎం చంద్రబాబుఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్‌లో కేవలం ఒక్క తల్లికి వందనం మాత్రమే అమలు చేసి సగం మంది తల్లుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేశారన్నారు. మిగిలిన వాటిని అమలు చేయకుండా మభ్యపెడుతున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడంలో భాగంగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, జెడ్పీటీసీలు శెట్టి రోషిణి, చటారి జానకమ్మ, ఎంపీపీలు శెట్టి నీలవేణి, బాక ఈశ్వరి, సర్పంచ్‌లు పూర్ణిమ, సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు స్వాభి రామూర్తి, కొర్రా సూర్యనారాయణ, పాంగి పరశురామ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తిరి రవి ప్రసాద్, గణపతి, ఎంపీటీసీ దురియా ఆనంద్, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్‌బీ స్వామి, మేధావి వర్గం జిల్లా అధ్యక్షువు రాజారమేష్, కల్చరల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు బంగురు శాంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన సత్యం, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాసిన్, ప్రచార కమిటీ అధ్యక్షుడు వి. కొండలరావు, మండల కార్యదర్శి కిల్లో దొన్ను పాల్గొన్నారు.
తీసుకెళ్లడమే లక్ష్యం
రేపు పాడేరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు అధ్యక్షతన జరిగే సమావేశానికి తరలిరావాలి
అరకు ఎమ్మెల్యే
రేగం మత్స్యలింగం పిలుపు

ప్రజల్లోకి చంద్రబాబు మోసాలు