విధుల పట్ల అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

విధుల పట్ల అలసత్వం వద్దు

Jul 3 2025 5:14 AM | Updated on Jul 3 2025 5:14 AM

విధుల పట్ల అలసత్వం వద్దు

విధుల పట్ల అలసత్వం వద్దు

జి.మాడుగుల: వైద్యాధికారులు, సిబ్బంది విధులపట్ల అలసత్వం వహించకుండా ప్రజలకు అందుబాటు ఉండి వైద్య సేవలు అందించాలని.. లేకుంటే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్‌ తమర్భ విశ్వేశ్వరనాయుడు హెచ్చరించారు. బుధవారం ఆయన స్థానిక పీహెచ్‌సీనీ తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్‌, రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. మలేరియా కేసులు, సుఖ ప్రసవాలు వివరాలను వైద్యుల నుంచి తెలుసుకున్నారు. ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్లు, ఎంఎల్‌హెచ్‌పీలు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పీహెచ్‌సీ పరిధిలోని పాఠశాలలు, ఆశ్రమ వసతి గృహాల్లో తరచూ వైద్యశిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. వైద్యాధికారి డాక్టర్‌ బి.కిశోర్‌, యూడీసీ సకల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement