
పీఈ సెట్‌లో అరకు విద్యార్థుల ప్రతిభ
● సాయి శ్రీనివాస్‌కు 2వ ర్యాంక్
అరకులోయ టౌన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2022–2025వ సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లో ముగ్గురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భరత్ కుమార్ నాయక్ తెలిపారు. ఇటీవల నాగార్జున విశ్వ విద్యాలయం విడుదల చేసిన పీఈసెట్ ఫలితాల్లో కళాశాలకు చెందిన ఆర్.సాయి శ్రీనివాస్ 2, ఎస్. అప్పలరాజు 111, జి. మధుబాబు 129వ ర్యాంక్‌లు సాధించారన్నారు. ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థులను ఆయనతోపాటు సిబ్బంది అభినందించారు.

పీఈ సెట్‌లో అరకు విద్యార్థుల ప్రతిభ

పీఈ సెట్‌లో అరకు విద్యార్థుల ప్రతిభ