
పౌష్టికాహారంసద్వినియోగం చేసుకోండి
● అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్
హుకుంపేట: అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ కె. సాహిత్ సూచించారు. గురువారం ఆయన మండలంలోని కులుపాడు,గడుగుపల్లి అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పౌష్టికాహార పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో బాలచంద్రమణిదేవి, సిబ్బంది పాల్గొన్నారు.