
28న మోడల్ డీఎస్సీ పరీక్ష
డాబాగార్డెన్స్: యూటీఎఫ్, డీవైఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో డీఎస్సీ మోడల్ పరీక్ష ఈ నెల 28న నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం సిటు కార్యాలయంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి టీఆర్ అంబేడ్కర్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు యూఎస్‌ఎన్ రాజు, కార్యదర్శి సంతోష్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడల్ డీఎస్సీ పేపర్‌ను ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుచే రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఎస్జీటీ అభ్యర్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 93989 70538, 63022 728 62లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవా లని సూచించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమా శైలజ పాల్గొన్నారు.