
ఎయిర్‌టెల్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు
సీలేరు: జి.కె.వీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ మారుమూల మాదిమల్లు, గుమ్మిరేవుల గ్రామాల్లో మూడు నెలలుగా ఎయిర్‌టెల్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయా గ్రామాల గిరిజనులు సెల్ టవర్ల వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. మూడు నెలల నుంచి నెట్‌వర్క్ సేవలు అందుబాటులో లేకపోయినా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్టారు. ఇప్పటికై నా ఎయిర్‌టెల్ అధికారులు తక్షణమే స్పందించి నెట్‌వర్క్ సేవలు అందుబాటులో తేవాలని ఆయా గ్రామస్తులు కోరారు.