వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

గిరిజనుల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ - Sakshi

ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఆదేశం

పాడేరు రూరల్‌ : స్పందన వినతుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని ఐటీడీఏ పీవో ఆర్‌. గోపాలకృష్ణ ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా తాగునీటి సదుపాయం, రహదారుల నిర్మాణాలు, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఘాట్‌ మార్గంలో రక్షణ గోడలు నిర్మించాలని వినతులు అందాయి. అనంతరం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. స్పందన వినతుల పరిష్కారానికి ప్రత్యేకంగా విచారణాధికారిని నియమించాలని సూచించారు. అధికారులు ముందుగా అర్జీలు తమ శాఖకు సంబంధించిందా కాదా అనేది ముందుగా పరిశీలించాలన్నారు. కాకుంటే సంబందిత శాఖకు అందజేయాలన్నారు.

స్వీకరించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్ర స్థాయి తనిఖీ చేపట్టి వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రధానమంత్రి ఆది ఆదర్శ యోజన పథకంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పీవీటీజీల జీవితాల్లో గణనీయమైన మార్పులు రావాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. అటవీ హక్కుల పత్రాలు పొందిన లబ్ధిదారుల వివరాలను గిరిభూమి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. జేసీ శివ శ్రీనివాస్‌, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top