ఆదిలాబాద్‌టౌన్: సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ లక్ష్యంగా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ‘హలో యువత.. చలో సీసీఐ పరిశ్రమ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర మంత్రులు గతంలో హామీ లు ఇచ్చారని, అయితే ప్రస్తుతం పరిశ్రమను తుక్కు కింద విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్, విద్యుత్ శాఖలకు సీసీఐ బకా యిలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకో వడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు దర్శనాల మల్లేశ్, అఖిలపక్ష నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు బండి దత్తాత్రి, మెట్టు ప్రహ్లాద్, గోడం గణేశ్, యూనుస్ అక్బానీ, వెంకటనారాయణ, రాజు, సతీష్, కస్తాల ప్రేమల, ఆయా పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


