బీవీ సుబ్బయ్య పాఠశాలలో అభినందనలు
డ్రీమ్స్ స్కూల్లో..
నిర్మల పాఠశాల విద్యార్థులతో..
జీఎమ్‌ఎస్‌లో అభినందనలు
క్విస్ విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం
ఒంగోలు సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో గురువారం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఒంగోలు నగరంలో కర్నూలు రోడ్డులోని క్విస్ హైస్కూల్ విద్యార్థిని పున్నాల అమృత (592) మార్కులు సాధించింది. 18 మంది 550 పైగా, 28 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించారు. క్విస్ విద్యాసంస్ధల అధినేత డాక్టరు నిడమానూరు సూర్య కళ్యాణ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టరు నిడమానూరి గాయత్రిదేవి, ప్రిన్సిపాల్ కమలేశ్వరి, ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.
నారాయణ స్కూల్ విద్యార్థుల ప్రతిభ..
నారాయణ స్కూల్ విద్యార్థి వేముల రామకృష్ణ 598 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రతిభ సాధించారు. పది మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. ప్రతి ఇద్దరిలో ఒకరికి 550 మార్కులు సాధించారని తెలిపారు. నారాయణ స్కూల్స్ ఏజీఎం పెద్దిరెడ్డి, డీజీఎం పిచ్చిరెడ్డి మాట్లాడుతూ ఇంతటి ఘన విజయానికి కారణమైన విద్యార్ధుల కఠోర శ్రమ, ఉపాధ్యాయుల అంకితభావాన్ని తల్లిదండ్రుల సహకారాన్ని కొనియాడారు. క్లస్టర్ ప్రిన్సిపాల్స్, అకడమిక్ డీన్స్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మాంటిస్సోరి ప్రతిభ...
రేవేండ్ల టాప్సీ 592 మార్కులు, కె.ధన్వీన్ 590 మార్కులు సాధించి ప్రతిభ చూపినట్లు కరస్పాండెంట్ ప్రకాష్, డైరెక్టర్ శబరీనాథ్, ప్రిన్సిపాల్ నూరుద్దీన్ తెలిపారు. 23 మంది వి 580 మార్కులు పైగా సాధించినట్లు తెలిపారు.
ప్రతిభ విద్యాసంస్థలు
మారం ఈశ్వరరెడ్డి 583 మార్కులు, నారు అరుణ్‌కుమార్‌రెడ్డి 557, పి.జగన్‌సాయి 551, లోకండె వెంకటశ్రీలక్ష్మి 550 మార్కులు సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు, సీఈఓ నల్లూరి జయప్రకాష్‌నారాయణ్, ఉపాధ్యాయ, సిబ్బంది అభినందనలు తెలిపారు.
సత్తా చాటిన ఎస్‌ఆర్ స్కూల్..
ఎం. బాలాదిత్య 590, ఎన్.బ్రహ్మేశ్వర్ 586, డి.నాగఅంజలి 583, ఆర్.గణేష్ 574 మార్కులతో సత్తా చాటారని ఎస్.ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ ములకా రామిరెడ్డి, డైరెక్టరు ములకా రత్నకుమారి, ప్రిన్సిపాల్స్ విజయ, ప్రశాంతి,రెహమాన్, జానీ, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
కేరళ హైస్కూల్..
వై.విమల జానకి 596 మార్కులతో సత్తా చాటారని కరస్పాండెంట్ సీబీ మైఖేల్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పి.జ్యోతిర్మయి 592, డి.హేమంత్‌బాబు 591, ఇ.వి.సాయి మహిత 590 మార్కులతో సత్తా చాటారు. 39 మంది విద్యార్ధులు 500 పైగా మార్కులు సాధించారని తెలిపారు. సీబీ మైఖేల్, షైమా సిబి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
డ్రీమ్స్ విద్యార్థుల
విజయదుందుభి
ఎస్‌కే షహీన్ 586, పి.సంయుక్త ప్రియ 579, సాయి కార్తిక 575, బి. కుసుమాంజలి 574,పి. భార్గవరామ్ 553 మార్కులు సాధించారని స్కూలు కరెస్పాండెంట్ లక్ష్మీదేవి తెలియజేశారు.
జీఎంఎస్ విద్యార్థుల హవా..
జి.భాను ప్రసాద్ 590, జి. మోక్షిత్ సాయి తేజ 589, బి.వెంకట సాయి జ్యోతిక 588 మార్కులతో ప్రతిభ కనబర్చారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 42 శాతం మంది 550 మార్కులు, 69 శాతం మంది 500 కి పైగా మార్కులు సాధించారని కరస్పాండెంట్ ఎం. కొండయ్య తెలిపారు. ప్రిన్సిపాల్, డీన్స్ పి.రామారావు, అలెక్స్, సీహెచ్ సుజిత తదితరులు పాల్గొన్నారు.
బీవీ సుబ్బయ్య స్కూలు విద్యార్థులు ప్రతిభ
విద్యార్థులు అత్యుతమ ఫలితాలు సాధించారని స్కూలు కరెస్పాండెంట్ బొడ్డు కోటిలింగం తెలిపారు. ఎం. మాధవ రెడ్డి 589, ఎం.రాము 583, ఎస్. సాయికృష్ణారెడ్డి 584 మార్కులు సాధించారన్నారు. శ్రీ విశ్వేశ్వరయ్యి ఎడ్యుకేషనల్ సొసైటీ ట్రెజరర్ బి. రవిప్రసాద్, స్కూలు హెచ్‌ఎం వై. వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రా హైస్కూలు విద్యార్థుల సత్తా
పదో తరగతి పరీక్షల్లో ఆంధ్ర హై స్కూల్ విద్యార్థి డి. ప్రవళిక కే. భానుతేజ 586 మార్కులు సాధించారని స్కూల్ కరస్పాండెంట్ జి. శ్రీనివాసరావు , డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. అలాగే రోజారమణి 580, యన్ ఆశ్రిత 577 మార్కులు వచ్చాయని వారు చెప్పారు.
నిర్మల హైస్కూలు..
ఉత్తమ ఫలితాలు సాధించారని స్కూలు కరెస్పాండెంట్ ఎన్. సురేంద్ర, చీఫ్ అకడమిక్ అడ్వైజర్ ఎన్.హరిబాబు తెలిపారు. కె. జాగృతి 596, ఏఎన్‌ఎస్ వైష్ణవి 594, ఎల్ హిమబిందు, కే మేఘనలకు 591 మార్కులు వచ్చాయన్నారు. ప్రిన్స్‌పల్ ఎస్. విక్టర్ పాల్, ఎన్. పద్మజ పాల్గొన్నారు.


