ఒంగోలు టౌన్: జిల్లా ప్రజా పరిషత్‌లో పనిచేస్తూ మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ నియామక పత్రాలు అందజేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో జూనియర్ సహాయకులుగా నియామకపత్రాలు అందజేశారు. ఒంగోలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో దాసిరి అమూల్య, ఎం రామకృష్ణ, కొండపి మండల పరిషత్‌లో కె.వెంకటరెడ్డి, వలేటివారిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో డి.శివ కార్తీక్, రాచర్ల మండల పరిషత్ కార్యాలయంలో బి.అశోక్‌రెడ్డి, కురిచేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శేషం సరళ కుమారి, వీరభద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీహెచ్ వంశీకృష్ణ, కామేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్.మెర్సీ, సంజీవరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షేక్ గౌసియాలను నియమించారు. కార్యక్రమంలో జెడ్పీ ముఖ్య కార్య నిర్వాహణాధికారి బి.చిరంజీవి, ఉప ముఖ్య కార్యానిర్వాహణాధికారి పి.బాలమ్మ పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్:
జిల్లా ప్రజా పరిషత్‌లో పరిధిలో వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న నలుగురు సీనియర్ సహాయకులకు పరిపాలనాధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపట్నం మండల ప్రజా పరిషత్ కార్యలయంలో పీఐయూ (పీఆర్)లో విధులు నిర్వహిస్తున్న టి.మారుతీరాం, కందుకూరు పీఆర్‌ఐ డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న షేక్ జాఫర్ బాషా, యర్రగొండపాలెం పీఆర్‌ఐ సబ్ డివిజన్‌లో పనిచేస్తున్న సయ్యద్ ఖలీముద్దిన్ ఖాద్రీ, ఒంగోలు జిల్లా ప్రజా పరిషత్‌లో పనిచేస్తున్న టీవీఎస్ సూరిలకు పదోన్నతుల ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ పి.బాలమ్మ, పరిపాలనాధికారి చల్లా శ్రీనివాస కుమార్ తదితరులు పాల్గొన్నారు.


