చింతూరు: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులను ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ ఆదేశించారు. స్థానిక కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు మండలాల ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన 68 దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో నాలుగు మండలాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆప్షన్–2 నిర్వాసితులకు ఒకే విడతలో చెల్లింపు
పునరావాస కాలనీల నిర్మాణంలో భాగంగా స్వయంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ఆప్షన్–2 ఎంచుకున్న నిర్వాసితులకు ఒకే విడతలో సొమ్ములు జమ చేస్తామని ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌ఆర్ అధికారి శుభం నొఖ్వాల్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనితో పాటు ఆప్షన్–2 ఎంచుకున్న నిర్వాసితులు ఏడాదిలోగా ఇళ్లు నిర్మించకుంటే సొమ్ములను రికవరీ చేస్తామనే నిబంధనను సడలిస్తున్నట్లు పీవో తెలిపారు.
ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్


