
అరచేతిలో ‘నా పంచాయతీ’
అవగాహన కల్పించాలి
పంచాయతీల సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు మేరీ పంచాయతీ యాప్ ఉందని చాలా మంది ప్రజలకు తెలియదు. అధికారులు ఈ యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి. – సుమన్, ధర్మారం
యాప్‌తో సమగ్ర సమాచారం
మేరీ పంచాయతీ యాప్‌తో పంచాయతీల సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. పంచాయతీలకు వచ్చే నిధులు, చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్‌పై పంచాయతీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. – శ్రీనివాస్,
జిల్లా పంచాయతీ అధికారి, నిర్మల్
లక్ష్మణచాంద: గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులను ప్రజలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయతీ(నా పంచాయతీ)అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఆదాయ, వ్యయాల్లో పారదర్శకత పాటించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులను పాలకవర్గాలు ఎలా ఖర్చు చేస్తున్నాయనే సమాచారం నేరుగా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను 2019లో రూపొందించినప్పటికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల పూర్తిస్థాయిలో అప్పట్లో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం సమగ్ర సమాచారంతో అందుబాటులోకి వచ్చింది.
వివరాలు తెలుసుకోవచ్చు
పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులు, వాటి వివరాలను జీపీ అధికారులు ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపరుస్తారు. ప్రభుత్వాలు ఏటా ఎన్ని నిధులు మంజూరు చేసింది, ఎంత ఖర్చయింది, తదితర పనులు ఏ దశలో ఉన్నాయో వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నిధుల్లో సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు యాప్‌లో నమోదు చేస్తారు. ఇవే కాకుండా వచ్చే ఏడాది అంచనా వ్యయాల నమోదు, గ్రామసభల వివరాలను యాప్‌లో అందుబాటులో ఉంటాయి. వివరాలు నమోదు చేసే సమయంలోనే జీపీఆర్‌ఎస్ ద్వారా గుర్తించే అవకాశం ఉంది. కాగా, మేరీ పంచాయతీ యాప్‌పై విద్యావంతుల్లో కొందరికి తప్ప మిగిలిన వారికి తెలియదని తెలుస్తోంది. పంచాయతీ అధికారులు ఇప్పటికై నా స్పందించి పల్లెల్లో అవగాహన కల్పించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
డౌన్‌లోడ్ చేసుకోవాలి
స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్‌కు వెళ్లి మేరీ పంచాయతీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని లాగిన్ కావాలి. ఆ వెంటనే ఫైనాన్షియల్ ఇయర్, స్టేట్, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు నమోదు చేయాలి. వాటిని నమోదు చేయగానే పంచాయతీల వివరాలు కనిపిస్తాయి. గ్రామం పేరు, లేదంటే పిన్ కోడ్‌తో పంచాయతీల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. చేసిన పనుల ఫొటోలను యాప్‌లో పొందుపరుస్తారు.
అందుబాటులోకి యాప్ నిధుల ఖర్చులో పారదర్శకతకు ప్రాధాన్యత ఆదాయ వ్యయాలు తెలుసుకునే అవకాశం
పొట్టపెల్లి పంచాయతీ భవనం

అరచేతిలో ‘నా పంచాయతీ’

అరచేతిలో ‘నా పంచాయతీ’