
మనం ఆదర్శంగా ఉంటేనే..
మాది తాంసి మండలంలోని జామిడి. నేను ఇచ్చోడలో ఉంటాను. ప్రస్తుతం బజార్హత్నూర్ ఉన్నత పా ఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యూకేషన్) గా పనిచేస్తున్నాను. నా కూ తురు మేఘ నేను బోధించే పాఠశాలలోనే 8వ తరగతి చదువుతుంది. నాతో పాటు ప్రతిరోజు తీ సుకెళ్తాను. గతంలో బజార్హత్నూర్ మండలంలో ని కాండ్లీ పాఠశాలలో పనిచేశాను. 1 నుంచి 5వ త రగతి వరకు అక్కడే చదివించాను. ఉపాధ్యాయులను చూసే మిగతా వారు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపుతారనేది నా నమ్మకం. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది.
– సర్పే చందన్బాబు, స్కూల్ అసిస్టెంట్