
విద్యార్థులతో మాట్లాడుతున్న చంద్రశేఖర్‌రెడ్డి
ఆదిలాబాద్ టౌన్: పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పదో తరగతి ప్రత్యేక తరగతుల రాష్ట్ర అబ్జర్వర్, ఎస్ ఈఆర్టీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం తని ఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి ప్ర త్యేక తరగతులు, స్నాక్స్ విషయాలపై ఆరా తీశారు. పట్టణంలోని ఆర్పీఎల్, తలమడుగు మండలంలోని కజ్జర్ల, తాంసి మండలంలోని పొన్నారి, కప్పరల, ఆదిలాబాద్ మండలంలోని పొచ్చర పాఠశాలలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని, వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి సి–గ్రూప్ విద్యార్థులపై ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
అలాగే ప్రతిరోజు స్లిప్ టెస్టులు నిర్వహించి మూల్యాంకనం చేయాలని, విద్యార్థులు సాధించిన మార్కులను తల్లిదండ్రులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా ముద్రించిన లేఖలను పేరెంట్స్‌కు అందజేయాలని సూచించారు. అలాగే ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు స్నాక్స్ అందజేయాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట డీఈవో ప్రణిత, సెక్టోరియల్ అధికారి నర్సయ్య, ప్రతాప్, వీరేందర్, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.