breaking news
Yellow horns
-
కృష్ణహరిద్రం
కృష్ణహరిద్రం అంటే నల్లపసుపు. పసుపులోని ఒకజాతికి చెందిన ఈ పసుపుకొమ్ములు నల్లగా ఉంటాయి. గ్రహదోషాల నివారణకు, తాంత్రిక ప్రయోగాల విరుగుడుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. నల్లపసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ణకేదార అని కూడా పిలుస్తారు. ఈ పసుపుకొమ్ము లోపలిభాగం ముదురునీలం లేదా ముదురు ఊదా రంగులో ఉంటుంది. తెలియని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు నల్లపసుపు కొమ్మును జేబులో ఉంచుకుంటే ఎలాంటి దుష్టశక్తులూ సోకవని ప్రతీతి. నల్లపసుపును దంచి, దానిని గోమూత్రంతో కలిపి ముద్దలా తయారు చేసి, ఆ ముద్దను నొసట తిలకంలా ధరిస్తే జనాకర్షణ శక్తి పెరుగుతుంది. నల్లపసుపును చందనంతో రంగరించి నుదుట తిలకంలా ధరిస్తే, నరదృష్టి వల్ల కలిగే ఇబ్బందులు నశిస్తాయి. నల్లపసుపుకొమ్మును ముక్కలుగా లేదా పొడిగా చేసి, తాయెత్తులో భద్రపరచి నల్లదారంతో మెడలో ధరిస్తే శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఏదైనా శనివారం రోజున నల్లపసుపు కొమ్మును పూజలో ఉంచి, ఆ తర్వాత దానిని సిందూరం రంగుగల వస్త్రంలో చుట్టి డబ్బు భద్రపరచేచోట ఉంచినట్లయితే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. – పన్యాల జగన్నాథ దాసు -
అల్లం వెల్లుల్లి నిల్వ ఉండాలంటే..!
కిచెన్ కిటుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... రుబ్బే ముందు వాటిని కాస్త దోరగా వేయించాలి. అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే... తరిగిన తర్వాత నీటిలో కాకుండా మజ్జిగలో వేయాలి. అలా చేయడం వల్ల కూర కూడా రుచిగా ఉంటుంది. బియ్యం, పప్పులు పురుగు పట్టకుండా ఉండాలంటే... కొన్ని పసుపు కొమ్ములు వేస్తే సరి. ఉల్లిపాయను సగం వాడాక, రెండో సగం నల్లగా అయి పాడవుతుంది. అలా కాకుండా ఉండాలంటే... ఆ బద్దకు వెన్న రాసి ఉంచాలి. పాలు ఎక్కువ మీగడ కట్టాలంటే... పాలు పోసిన గిన్నెను ముందు కాసేపు చల్లని నీటిలో ఉంచి, అప్పుడు కాచాలి.