breaking news
workers party
-
కిమ్ చేతిలో బ్రహ్మాస్త్రం!
సియోల్: ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధాలకు పదును పెడుతున్నారు. అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థ ‘హసాంగ్–20’ను సిద్ధం చేశారు. అధికార వర్కర్స్ పార్టీ 80వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి రాజధాని పాంగ్యాంగ్లో అట్టహాసంగా జరిగిన భారీ మిలటరీ పరేడ్‌లో ఈ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆయుధం ప్రజలకు దర్శనమివ్వడం ఇదే తొలిసారి. కిమ్ చేతిలో ఇదొక బ్రహ్మాస్త్రమని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా అభివరి్ణంచింది. అమెరికాతోపాటు ఆసియాతోని శత్రుదేశాలను భయపెట్టడమే లక్ష్యంగా ‘హసాంగ్–20’ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణిని ఇంకా పరీక్షించలేదు. మరికొన్ని రోజుల్లో టెస్టు చేయబోతున్నట్లు సమాచారం. మిలటరీ పరేడ్‌కు చైనా, రష్యా, వియత్నాం తదితర దేశాల ముఖ్యనేతలు, అధికారులు సైతం హాజరయ్యారు. ఉత్తర కొరియా ఆయుధ సంపత్తిని ప్రత్యక్షంగా వీక్షించారు. శత్రువులను మట్టికరిపించేలా తమ సైన్యాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతామని కిమ్ జోంగ్ ఉన్ ఈ సందర్భంగా ప్రకటించారు. అమెరికా, దక్షిణ కొరియా పేర్లను నేరుగా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న ఉత్తర కొరియా సైనికులను కిమ్ ప్రశంసించారు. అంతర్జాతీయ న్యాయం, నిజమైన శాంతి కోసం జరుగుతున్న యుద్ధంలో వారు అద్భుతమైన పోరాట స్ఫూర్తిని కనబరుస్తున్నారని కొని యాడారు. తాము అధిగమించలేని అవరోధాలు, సాధించలేని విజయాలు ఏవీ లేవని వ్యాఖ్యానించారు. ఒక బలమైన శక్తిగా ఈరోజు ప్రపంచం ఎదుట సగర్వంగా నిలిచామని పేర్కొన్నారు. మిలటరీ పరేడ్‌లో లాంగ్–రేంజ్, షార్ట్–రేంజ్ స్ట్రాటజిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్ లాంచ్ వెహికల్స్, డ్రోన్లు, యుద్ధ ట్యాంక్‌లు సైతం ప్రదర్శించారు. ఏమిటీ హసాంగ్–20?మిలటరీ పరేడ్‌లో 11 ఇరుసుల భారీ లాంచర్ ట్రక్కుపై హసాంగ్–20 క్షిపణిని ప్రదర్శించారు. కార్బన్ ఫైబర్‌తో రూపొందించిన ఈ క్షిపణి ఇంజిన్ 1,971 కిలోన్యూటన్ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేయగలదు. సుదూరంలో ఉన్న లక్ష్యాలను సులభంగా ఛేదించగలదు. ఒకేసారి బహుళ అణు వార్హెడ్లను మోసుకెళ్లేలా డిజైన్ చేశారు. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలను తుత్తునియలు చేయగలదని అంటున్నారు. భవిష్యత్తులో అమెరికా నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడానికి హసాంగ్–20ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ మిస్సైల్ కనీస రేంజ్ ఏకంగా 15,000 కిలోమీటర్లు(9,300 మైళ్లు) కావడం గమనార్హం. ఉత్తర కొరియా నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మధ్య దూరం దాదాపు 11,000 కిలోమీటర్లు. అంటే హసాంగ్–20తో అమెరికా రాజధానిని టార్గెట్ చేయొచ్చు. -
మా వైఫల్యాలున్నాయి: కిమ్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రజలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రకటన చేశారు. అనుకున్న లక్ష్యాలను సాధించడంలో తమ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగీకరించారు. సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రజలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రకటన చేశారు. అనుకున్న లక్ష్యాలను సాధించడంలో తమ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగీకరించారు. అయిదేళ్లకి ఒకసారి జరిగే అధికార వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ సదస్సుని బుధవారం ఆయన ప్రారంభించారు. గత అయిదేళ్లలో తాము నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యామని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని కిమ్ పేర్కొన్నట్టుగా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. గత తొమ్మిదేళ్ల పాలనలో కిమ్ గతంలో ఎన్నడూ లేనంతగా కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కరోనాతో సరిహద్దుల మూసివేత, దేశ ఆర్థిక రంగం కుదేలైపోవడం, అమెరికా విధించిన ఆంక్షలు, వరసగా కమ్మేసిన ప్రకృతి వైపరీత్యాలు వంటివన్నీ దేశాన్ని అతలాకుతలం చేశాయి. -
అతనేమయ్యాడు?.. ఉరితీశారా?!
సియోల్ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు అత్యంత సన్నిహితుడు, సైన్యాధ్యక్షుడు హ్యాంగ్ ప్యాంగ్ సో.. కొద్ది రోజుల నుంచి కనిపించకుండా పోయారు. ప్యాంగ్ అదృశ్యంపై ఉత్తర, దక్షిణ కొరియాల్లో మీడియాల్లో పలు కథనాలు వస్తున్నాయి. అధినేత కిమ్ తరువాత అంతటి శక్తివంతుడుగా పేరున్న ప్యాంగ్ కొద్ది రోజుల నుంచి ఎక్కడా కనిపించడం లేదు. ఇదిలాఉండగా.. ప్యాంగ్కు ఉత్తర కొరియా ప్రభుత్వం మరణశిక్ష విధించి ఉండొచ్చని దక్షిణ కొరియా మీడియా చెబుతోంది. అయితే మరణశిక్షపై విధించినట్లుగా చెబుతున్నా.. దానిపై ఎక్కడా స్పష్టత లేదు. హ్యాంగ్ ప్యాంగ్ సోపై ఉత్తర కొరియాలో అవినీతి ఆరోపణలు వచ్చాయని.. ఆ కారణం వల్లే. సైన్యాధక్ష పదవినుంచీ, వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి తొలగించినట్లు దక్షిణ కొరియా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. హ్యాంగ్ ప్యాంగ్తో పాటు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో కీలక వ్యక్తి, అధినేతకు సన్నిహితుడు అయిన కిమ్ వాంగ్ హ్యాంగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు దక్షిణ కొరియా మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కీలక వ్యక్తులపై అధినేత కిమ్ చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇది మిగిలిన నేతలకు, ప్రజలకు కూడా ఒక బలమైన హెచ్చరికలా ఉంటుందని కిమ్ భావించినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. -
బ్రెజిల్ అధ్యక్ష పగ్గాలు మళ్లీ రౌసెఫ్‌కే
రియోడీ జెనీరో: బ్రెజిల్ అధ్యక్ష పగ్గాలు మరోసారి వామపక్ష మహిళా నేత, వర్కర్స్ పార్టీకి చెందిన దిల్మారౌసెఫ్‌కే దక్కాయి. ‘నువ్వా-నేనా’ అన్నట్లు పోటాపోటీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి ఏసియోనెవెస్‌పై రౌసెఫ్ విజయం సాధించారు. రౌసెఫ్‌కు 51.6 శాతం ఓట్లు లభించగా, ఏసియోనెవెస్ 48.4 శాతం ఓట్లు సాధించారు. బ్రెజిల్లో 2003 నుంచి వర్కర్స్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఈ కాలంలో అమలు చేసిన సామాజిక, సంక్షేమ కార్యక్రమాల చేయూతతో ఎందరో పేదరికం నుంచి బయటపడ్డారు. అయితే, గత నాలుగేళ్లుగా ఆర్థిక రంగం తిరోగమనం బాటలో నడుస్తున్నా, దేశాన్ని తిరిగి ప్రగతి బాటన పరుగులెట్టిస్తానని నెవెస్ హామీలిచ్చినా... ఓటర్లు వరుసగా నాలుగోసారి వర్కర్స్ పార్టీకే పట్టం కట్టారు. కాగా, బ్రెజిల్ అధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికైన దిల్మారౌసెఫ్‌కు భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఆమెతో కలసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక రంగ పురోగమనానికి కృషి చేస్తా... బ్రెజిల్ ఆర్థిక రంగాన్ని పురోగమనం వైపు తీసుకెళతానని, అవినీతిపై పోరాడతానని రౌసెఫ్ ప్రకటించారు. విజయం సాధించిన అనంతరం ఆదివారం ఆమె బ్రసీలియాలో మీడియాతో మాట్లాడారు.


