breaking news
Womens Parliament
-
'ప్రసార మాధ్యమాల భాగస్వామ్యం అవసరం'
విజయవాడ: మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు లక్ష్యం నెరవేరాలంటే ప్రసార మాధ్యమాల భాగస్వామ్యం అవసరం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుపై ఎప్పటికప్పడు ప్రచారం కోసం ఎమ్మెస్వోలతో చర్చించామని, స్థానిక, జాతీయ ఛానెళ్లలో కూడా ఈ సదస్సుపై ప్రచారం, అవగాహన కల్పించాలని ప్రతినిధులను కోరామని చెప్పారు. సినిమా హాళ్లలో కూడా ప్రచారం చేపడతామంటూ ఇందుకు లఘుచిత్రాలను రూపొందించామన్నారు. పార్టీలకతీతంగా ఈ సదస్సులో పాల్గొనాలని కోరామని, పార్టీల నుంచి సానుకూలంగా స్పందన వచ్చిందని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ సహా ఇతర అన్ని పార్టీలకు లేఖలు రాసి సదస్సుకు ఆహ్వానించామన్నారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు 15 రాష్ట్రాల స్పీకర్లు హాజరవుతారని తెలిపారు. ఫిబ్రవరి 10న దలైలామా హాజరుకానున్నారని కోడెల చెప్పారు. -
ప్రతిష్టాత్మకంగా మహిళా పార్లమెంటు
ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజులు నిర్వహణ: స్పీకర్ కోడెల సాక్షి, అమరావతి: అమరావతి వేదికగా ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా జాతీయ మహిళా పార్లమెంటు నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నామని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వ్యాపార, వాణిజ్య రంగాల మహిళా ప్రముఖులు 12 వేల మందిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సదస్సు ఏర్పాట్లపై హైదరాబాద్ అసెంబ్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 2,500 కళాశాలల నుంచి నలుగురు చొప్పున విద్యార్థులు సదస్సులో పాల్గొంటారని చెప్పారు.మహిళా సాధికారత కోసం స్వరాజ్య మైదానం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకూ ప్రత్యేక పరుగు ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు: అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి కావచ్చిందని, సమావేశాలు ఫిబ్రవరిలో ఉంటాయని స్పీకర్ తెలిపారు. అసెంబ్లీ కమిటీ సమావేశాలు హైదరాబాద్లో ఉంటాయా? అమరావతిలోనా అని ప్రశ్నించగా అన్ని కమిటీ సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయని సమాధానమిచ్చారు.