breaking news
woman hostels
-
పోలీస్ అంటూ.. మహిళా హాస్టల్‌కు వెళ్లి..
హైదరాబాద్: పోలీస్ అవతారమెత్తి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పేట్‌బష్‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పేట్‌బష్‌రాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏసీపీ శంకర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లాకు చెందిన పాండి యాదగిరి అలియాస్ అనీల్‌కుమార్ (25) సిద్దిపేట జిల్లా బండమైలారం గ్రామంలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. గతంలో మహంకాళి ట్రాఫిక్ పోలీసు విభాగంలో క్యాజువల్ లేబర్‌గా పనిచేసిన సమయంలో పోలీసుల పనితీరుపై అవగాహన ఏర్పడింది. డబ్బు సంపాదించాలనే ఆశతో అతను పోలీసు యూనిఫామ్, మోటార్ సైకిల్‌ను కొనుగోలు చేసి, పోలీసు అధికారిగా నటిస్తూ తిరగడం ప్రారంభించాడు. దుండిగల్‌లోని ఓ బాలికల హాస్టల్‌ను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు పాల్పడ్డాడు. పేట్‌బష్‌రాబాద్–మేడ్చల్ హైవేపై ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా నటిస్తూ వాహనదారుల నుండి డబ్బు వసూలు చేశాడు. సుచిత్రలోని మోనిడాశ్రీ గరŠల్స్ హాస్టల్‌కు వచి్చన యాదగిరి రాత్రి హాస్టల్లో కార్యకలాపాలు నిలిపివేయాలని యజమాన్యాన్ని బెదిరించాడు. ఈ నెల 29న రాత్రి మరోసారి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. అమ్మాయిలపై ప్రాసిస్ట్యూషన్ కేసులు నమోదు చేస్తానని, వారి మొబైల్ ఫోన్లు లాక్కొని ఫొటోలు తీసి బెదిరించాడు. దీంతో హాస్టల్ నిర్వాహకుడు గుడూరు విజయ్‌కుమార్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పేట్‌బïÙరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. -
ఆర్‌యూకు మహర్దశ
– రూ.48 కోట్లతో కొత్త భవనాల నిర్మాణం - రిజిస్ట్రార్ అమర్నాథ్ కర్నూలు (ఆర్యూ) : రాయలసీమ యూనివర్శిటీకి మహర్దశ పట్టనుంది. రూ.48.20 కోట్లతో మహిళా హాస్టళ్ల భవనాలు(రెండు) నిర్మించనున్నట్లు రిజిస్ట్రార్ అమర్నాథ్ బుధవారం తెలిపారు. రూ.48.20 కోట్లతో ఎంఎన్‌డీసీలో తీర్మానం చేశారని, ప్రభుత్వ ఆమోదం, ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల పూర్తయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అనంతరం ఆర్‌అండ్‌బీకి అప్పగించి పనులు మొదలు పెడతామని పేర్కొన్నారు. అతిపెద్ద లైబ్రరీ వర్సిటీలో 25 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అధునాతనమైన డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. అలాగే మాథ్స్ బిల్డింగ్ ప్రహరీ, అంతర్గత రోడ్డు పేమెంటు నిర్మాణం చేపడతామన్నారు. ఇక సైన్స్ పరికరాల కోసం మంగళవారం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో వీసీ నరసింహులు స్పెయిన్ కంపెనీ ఇడిబాన్ ఇంటర్నేషనల్ ఎస్ఏ చైర్మెన్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఈ కంపెనీ దేశంలో ఎంపిక చేసిన వర్సిటీల్లో 1500 కోట్లతో సైన్స్ పరికరాలను అందించనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. అలాగే వర్సిటీ ప్రాంగణంలో 5 అంతస్తుల్లో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. పది పడకల ఆస్పత్రిని నిర్మించి ఇద్దరు డ్యూటీ డాక్టర్లు, నర్సులను నియమిస్తామని తెలిపారు.


