breaking news
Withholds
-
జేఈఈ మెయిన్ ఫలితాలు.. 110 మందికి షాక్!
జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం అర్థరాత్రి విడుదల చేసింది. 2.50 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించినట్టు వెల్లడించింది. 24 మంది 100 పర్సంటైల్ సాధించినట్టు తెలిపింది. అయితే 110 మంది ఫలితాలను ప్రకటించకుండా ఎన్టీఏ నిలిపివేసింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వీరి ఫలితాలను ప్రకటించలేదని ఎన్టీఏ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫోర్జరీ పత్రాలు ఉపయోగించడం పాటు రకరకాలుగా మోసాలకు పాల్పడినట్టు ఆరోపించింది.వ్యక్తిగత వివరాల్లో వ్యత్యాసం కారణంగా మరో 23 మంది ఫలితాలను కూడా ప్రకటించలేదు. ఫొటోలు, బయోమెట్రిక్ డేటాలో తేడాల కారణంగా ఈ 23 మంది రిజల్ట్ విడుదల కాలేదు. వీరు గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్ సమర్పించాలని ఎన్టీఏ (NTA) సూచించింది. వీటిని పరిశీలించిన ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. తాము ఎటువంటి తప్పుచేయలేదని అభ్యర్థులు నిరూపించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షలు దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో జనవరి- ఏప్రిల్‌లో జరిగాయి. సెషన్ 1 పరీక్ష సమయంలో 39 మంది అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్టు ఎన్టీఏ గుర్తించింది. సెషన్ 2లో ఇదే రకమైన ఆరోపణలతో 110 మందిని గుర్తించడంతో మొత్తం 149 మందిని అనుమానిత జాబితాలో చేర్చింది. వీరిలో 133 మంది ఫలితాలు విడుదల చేయకుండా ఎన్టీఏ నిలిపివేసింది. తాము నిబంధలను ఉల్లంఘించలేదని నిరూపించుకున్న తర్వాతే వీరి పరీక్షా ఫలితాలను వెల్లడిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. నిష్పాక్షికత, పారదర్శకత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని కుండబద్దలు కొట్టింది.సరైన పత్రాలతో తమను సంప్రదించండిఫలితాలు విడుదలకాని అభ్యర్థులు సరైన పత్రాలతో తమను సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది. కరెక్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఎథికల్ కండక్ట్ కలిగివుంచాలని వెల్లడించింది. పరీక్షల్లో అర్హత సాధించడానికి అనైతిక మార్గాలు అనుసరించకుండా అడ్డుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు తమకు సహకరించాలని కోరింది. చదవండి: 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు వీరేఅక్రమాల నివారణకు చర్యలుదేశంలో అత్యంత పోటీ ఉండే జేఈఈ పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. పలు రకాలుగా భద్రత ఏర్పాటు చేస్తోంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఏఐ- ఆధారిత వీడియో ఎనలిటిక్స్, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెడుతోంది. పరీక్షల్లో డిజిటిల్ అక్రమాలను నిరోధించేందుకు ఎగ్జామ్స్ సెంటర్ల వద్ద 5జీ జామర్లను అమరుస్తోంది. అంతేకాదు కొత్తగా అందుబాటులోకి వచ్చిన పరీక్షా కేంద్రాల్లో థర్డ్ పార్టీ ఏజెన్సీలతో ముందుగానే తనిఖీలు నిర్వహించింది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు 1100 మందికి పైగా పరీక్షా నిర్వాహకులు, భాగస్వాములకు ముందుగానే ట్రైనింగ్ ఇచ్చింది. ఢిల్లీలోని సెంట్రల్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాల్లోని కదలికలను గమనిస్తూ అలర్ట్ చేసింది. -
మాల్యాకి మరో ఎదురు దెబ్బ
బెంగళూరు: మద్యం వ్యాపారి విజయ్ మాల్యా మరో భారీ షాక్ తగిలింది. బ్యాంకుల కన్సార్టియానికి వేలకోట్ల రుణాలు బాకీ పడ్డ ఈ లిక్కర్ టైకూన్ కి చెక్ పెట్టే క్రమంలో రుణ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) మరో అడుగు ముందు కేసింది. దీంతో యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) కంపెనీ నుంచి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు రావలసిన రూ.9.33 కోట్ల డివిడెండ్ ఆదాయానికి గండి పడింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను మద్యం సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ...మాల్యాకు చెల్లించాల్సిన డివిడెండ్ నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేసింది. తన అనుమతి లేకుండా మాల్యాకు ఈ డివిడెండ్ చెల్లించొద్దని డెట్ రికవరీ ట్రిబ్యునల్ కర్ణాటక ఆదేశించింది. దీంతో కంపెనీ..ఆయన చెల్లింపులను నిలిపి వేసింది. అయితే కంపెనీల చట్టానికి లోబడి అన్ని వివరాలను బహిరంగ పరుస్తాం...ఇంతకుమించి తానేమీ వ్యాఖ్యానించలేనని కంపెనీ సీఈవో శేఖర్ రామమూర్తి వ్యాఖ్యానించగా అతని డివిడెండ్ చెల్లింపును వాయిదా వేసినట్టు మరో ప్రతినిధి ధృవీకరించారు. మరోవైపు యునైటెడ్ స్పిరిట్స్ (యుఎస్ఎల్) చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నందుకు డియాజియో కంపెనీ నుంచి అప్పనంగా వచ్చిన (75 మిలియన్ డాలర్లు) సుమారు రూ 515 కోట్ల రూపాయలకు ఇపుడు ముప్పు ఏర్పడింది. ఈ మొత్తాన్ని మాల్యా చేతికివ్వొద్దని డిఆర్టి ఆ బ్యాంక్‌ను కోరింది. మాల్యా ఖాతాలకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా తనకు సమర్పించాలని జెపి మోర్గాన్ బ్యాంక్‌ను డీఆర్టీ ఆదేశించింది. కాగా మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి మే 13 న జరిగిన భేటీలో వాటాదార్లకు ఒక్కో షేరుపై రూ.1.15 చొప్పున డివిడెండ్ చెల్లించాలని యుబిఎల్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇటీవల సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మాల్యాకు చెల్లించాల్సిన డివిడెండ్ నిలిపి వేయాలని యుబిఎల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. యుబిఎల్‌లో మాల్యాతో పాటు అతడి నిర్వహణలోని తొమ్మిది కంపెనీలకు 8,11,88,930 షేర్లున్నాయి.