breaking news
wedding invitaion
-
ఇది కదా అంబానీ రేంజ్.. అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డ్ వైరల్
-
తాటాకులతో ఆహ్వాన పత్రికలు
చెన్నై, అన్నానగర్: వినూత్న రీతిలో తాటాకులతో ఆహ్వాన పత్రికలు, ఇంటి ఉపకరణాలను తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు మదురై జిల్లాకు చెందిన స్వామినాధన్. రాష్ట్రపు చెట్టు అయిన తాటి చెట్టు నుంచి ముంజలు, కళ్లు, కరుపట్టి వంటి వస్తువులు తయారుచేస్తారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వస్తువులను నిషేధించిన స్థితిలో అరటి ఆకు, గుడ్డ సంచులు, తాటి ఆకులతో చేసిన వస్తువులు ఉపయోగం ఎక్కువైంది. ఎలుమలై సమీపంలో ఉన్న రామనాధపురం గ్రామానికి చెందిన స్వామినాధన్ (30). ఇతను ఎంసీఏ చదివి బ్యాంకులో పనిచేసేవాడు. ప్రస్తుతం స్వామినాథన్ తాటి ఆకులతో పలు గృహోపయోగ వస్తువులను తయారు చేసే వ్యాపారం చేస్తున్నాడు. తాటి ఆకులతో బుట్టలు, పెట్టెలు, ప్రత్యేక బుట్టలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. దీంతో పాటు వివాహం కోసం దండలు, తోరణాలు వంటి వస్తువులను తాటి ఆకులతో తయారు చేస్తున్నాడు. వివాహం, ఆహ్వాన పత్రికలను అచ్చు కొడుతూ వస్తున్నాడు. విజిటింగ్ కార్డు కూడా తయారుచేస్తాడు. స్వామినాథన్ మాట్లాడుతూ.. తాటి ఆకులతో వస్తువు తయారీపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్నట్లు తెలిపాడు. స్వయంగా వ్యాపారం చేసే దాంట్లో తృప్తిగా ఉంటుందని, దీంతోపాటు కొంత మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వవచ్చని చెప్పారు. తాటి ఆకుల వస్తువులను ఉపయోగిస్తే ప్లాస్టిక్ అనర్థాలను కూడా తగ్గించవచ్చని చెప్పాడు. ఫ్రిడ్జ్‌లో కూరగాయలను పెట్టకుండా తాటి ఆకు బుట్టల్లో పెడితే 2, 3 రోజుల వరకూ కూరగాయలు చెడిపోకుండా ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై అందరూ అవగాహన కలిగి ఉంటే, పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చని తెలిపాడు. -
'మోదీజీ.. మా పెళ్లికి రండి'
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ తన పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. హర్భజన్ శనివారం మోదీని కలసి వివాహ పత్రికను అందజేశారు. బాలీవుడ్ నటి గీతా బాస్రాతో హర్భజన్ వివాహం అక్టోబరు 29న జరగనుంది. పంజాబ్‌లోని జలంధర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఓ హోటల్లో ఈ పెళ్లి జరగనుంది. చాలాకాలంగా హర్భజన్, గీతాబాస్రా ప్రేమలో ఉన్నారు. ఈ వివాహానికి పలువురు క్రికెటర్లతో పాటు బాలీవుడ్ నటులు హాజరవుతారని క్రికెటర్ సన్నిహితులు చెబుతున్నారు.