breaking news
Water utilisation
-
వ్యవసాయంపై అవగాహనలేని లోకేష్ మాట్లాడుతున్నారు..
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల రోజుల పాలనలో ఎన్నో ప్రజా ప్రయోజన నిర్ణయాలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. పాదయాత్ర సమయంలో ఆయన ఏవైతే హామీలను ఇచ్చారో.. అవి అమలు చేస్తున్నారని సర్వేపల్లి ఎం.ఎల్.ఏ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నదీ జలాలను సద్వినియోగ పర్చుకునేందుకు తెలంగాణా ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన కారణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనను చూసి ఓర్వలేక టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. భద్రత పై చంద్రబాబు గగ్గోలు పెట్టడం సరికాదు. ఆయనకు నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రతను కల్పిస్తోందన్నారు. వ్యవసాయం పై కనీస అవగాహన లేని లోకేష్ మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. -
తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు!
హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రం నీటిని వాడుకుంటుందని ఆరోపిస్తూ కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. వరద జలాలతోనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని, మిగులు జలాలతో విద్యుత్ ఉత్పత్తి చేయకూడదని లేఖలో ఏపీ ప్రభుత్వం సూచించింది. మిగులు జలాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల భవిష్యత్ లో సమస్యలు ఎదురవుతాయని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించకపోతే ఇరు రాష్ట్రాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.