breaking news
Wang Qi
-
సింగపూర్ ఓపెన్ విజేతగా పీవీ సింధు.. మూడో భారత ప్లేయర్‌గా..!
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం(జూలై 17) జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జి యిపై 21-9,11-21,21-15 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి సెట్లో ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. రెండో సెట్లో ఓడిపోయింది.అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్లో తిరిగి అద్భుతంగా పుంజుకున్న సింధు.. ఈ ఏడాదిలో తొలి సూపర్ 500 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా వాంగ్ జి యి చివరి వరకు అద్భుతమైన రీతిలో పోరాడింది. ఇక పీవీ సింధుకు ఈ ఏడాది సీజన్లో ఇది మూడో టైటిల్. అంతకుముందు సయ్యద్ మోదీ, స్విస్ ఓపెన్‌లో సూపర్ 300 టైటిల్స్‌ను సింధు సాధించింది. ఇక ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారత ప్లేయర్‌గా సింధు రికార్డులకెక్కింది. కాగా గతంలో 2010లో సైనా సెహ్వాల్, 2017లో సాయి ప్రణీత్ సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. చదవండి: Commonwealth Games 2022: 322 మందితో కూడిన జంబో టీమ్‌ను ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం SHE DID IT 👑@Pvsindhu1 went all guns blazing against 🇨🇳's Wang Zhi Yi to beat her 21-9, 11-21, 21-15 & win her 3rd title of the year at #SingaporeOpen2022 🏆🥇 Congratulations champ! 🥳 Picture Credit: @bwfmedia @himantabiswa @sanjay091968 #IndiaontheRise#Badminton pic.twitter.com/BIcDEzCz9z — BAI Media (@BAI_Media) July 17, 2022 -
54ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్న సైనికుడు
బీజింగ్: హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో.. పొరపాటున సరిహద్దులుదాటి పొరుగుదేశంలోకి ప్రవేశించిన ఓ సైనికుడు తిరిగి 54 ఏళ్ల తర్వాత సొంత దేశానికి చేరుకున్నాడు. భార్యాపిల్లలతో కలిసి శనివారం పుట్టినగడ్డకు చేరుకున్న అతడికి గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు. ఆ చైనీస్ సైనికుడి పేరు వాంగ్ కీ. ఇన్నాళ్లు అతను గడిపింది ఎక్కడోకాదు.. మన ఇండియాలోనే! అది 1963నాటి ముచ్చట.. భారత్ - చైనా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో కాపలా కాస్తోన్న వాంగ్ కీ.. పొరపాటున భారతభూభాగంలోకి ప్రవేశించి గల్లంతయ్యాడు. దారితోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతణ్ని రెడ్ క్రాస్ సంస్థ గుర్తించింది. అనంతరం వాంగ్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. వాంగ్‌ను చైనీస్ గూఢచారిగా అనుమానించిన ఇండియా అతనికి ఏడేళ్ల కారగారశిక్షను విధించింది. శిక్షపూర్తయిన తర్వాత చైనాకు వెళదామనుకున్న వాంగ్‌కు సొంతదేశం నుంచే విముఖత ఎదురైంది! పలు కారణాల వల్ల వాంగ్‌ను తన దేశస్తుడిగా అంగీకరించడానికి చైనా ప్రభుత్వం విముఖత ప్రదర్శించింది. దీంతో అతను ఇక్కడే ఉండిపోయాడు. ఇక్కడి అమ్మాయినే పెళ్లిచేసుకున్నాడు. ఏళ్లు గడిచినా వాంగ్‌కు సొంతదేశం వెళ్లాలనే కోరిక తగ్గలేదు. చైనీస్ ప్రభుత్వానికి తరచూ మొరపెట్టుకుంటూనే ఉండేవాడు. షాంగ్జీ క్జియాంగ్జియాన్ కౌంటీలోని జూజియానన్ గ్రామంలోని నివసించే వాంగ్కీ కుటుంబ సభ్యులు సైతం అంగీకరించినా ప్రభుత్వం వినిపించుకోలేదు. అతను కూడా తన పోరాటాన్ని ఆపలేదు.. వాంగ్కీ విషయమై భారత-చైనా దౌత్యాధికారుల మధ్య ఏళ్లపాటు చర్చలు జరిగాయి. చివరికి 2013లో వాంగ్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు చైనీస్ ప్రభుత్వం అంగీకరించింది. పాస్‌పోర్టు లభించిన నాలుగేళ్ల తర్వాత, శనివారం అతను చైనాలోని సొంత ఊరికి వెళ్లాడు. 54 ఏళ్ల తర్వాత తిరిగి వస్తుండటంతో వాంగ్‌ను చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిజియానన్ గ్రామస్తులంతా వరుసగా నిలబడి అతనికి స్వాగతం పలికారు. 54 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తన అన్నను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వాంగ్కీ సోదరుడు వాంగ్ షన్ మీడియాకు చెప్పాడు. చైనాలోని గ్జియాన్ జియాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయటకు వస్తూ వాంగ్ తన సోదరులు, అక్కచెల్లెల్లకు దగ్గరకు తీసుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. 'చిట్టచివరికి నా సొంతగూటికి చేరుకున్నా..' అన్నాడు చెమ్మగిల్లినకళ్లతో..