breaking news
Viom Networks
-
ఏటీసీ చేతికి వయోమ్
కొనుగోలు ప్రక్రియ పూర్తి డీల్ విలువ రూ. 7,635 ముంబై: నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు రావడంతో టెలికం టవర్ల నిర్వహణ సంస్థ వయోమ్ నెట్వర్క్స్ కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అమెరికన్ టవర్ కార్పొరేషన్ (ఏటీసీ) గురువారం వెల్లడించింది. దాదాపు రూ. 7,635 కోట్లకు వ్యోమ్‌లో 51 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు గతేడాది అక్టోబర్ 21న ఏటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం వ్యోమ్ విలువ సుమారు రూ. 22,000 కోట్లు. ఏటీసీకి ప్రపంచవ్యాప్తంగా 1,42,000 పైచిలుకు టెలికం టవర్లు ఉన్నాయి. వ్యోమ్‌కు 2011-12 నాటికి 40,000 పైచిలుకు టవర్లు ఉన్నాయి. 50 టవర్లతో 2005లో క్విపో టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా మొదలైన సంస్థ, టాటా టెలీసర్వీసెస్‌లో విలీనంతో వయోమ్గా రూపాంతరం చెందింది. దేశీయంగా అతి పెద్ద స్వతంత్ర టెలికం టవర్ కంపెనీగా ఎదిగింది. వయోమ్ డీల్‌తో ఏటీసీకి భారత్‌లో మొత్తం 57,000 పైగా టవర్లు ఉంటాయి. కోల్‌కతాకు చెందిన శ్రేయి గ్రూప్‌తో పాటు ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ తదితర ఇన్వెస్టర్ల నుంచి వాటాల కొనుగోలు ద్వారా వయోమ్ను ఏటీసీ దక్కించుకుంది. వయోమ్కు రూ. 5,100 కోట్ల రుణ భారం ఉంది. -
వయామ్ నెట్వర్క్స్.. అమెరికా టవర్ కార్ప్ పరం
డీల్ విలువ రూ.7,600 కోట్లు న్యూయార్క్: భారత్‌లో టెలికాం టవర్లను నిర్వహిస్తున్న వయామ్ నెట్‌వర్క్స్‌లో 51 శాతం వాటాను అమెరికాకు చెందిన అమెరికన్ టవర్ కార్పొ(ఏటీసీ) రూ.7,600 కోట్లకు కొనుగోలు చేయనున్నది. టాటా టెలిసర్వీసెస్, శ్రేయి ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థల నుంచి ఎక్కువ వాటాలను, ఇతర సంస్థల నుంచి కొంత మొత్తంలో వాటాలను ఏటీసీ కొనుగోలు చేస్తోంది. డీల్ మొత్తం నగదులోనే జరుగుతుందని సమాచారం. భారత టెలికాం రంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. వయామ్ కంపెనీ 42,200 మొబైల్ టవర్లను నిర్వహిస్తోంది. 1,000 మొబైల్ ఫోన్ మాస్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఏటీసీ నిర్వహిస్తున్న 14,000 టెలికాం మొబైల్ మాస్ట్స్ను కూడా వయామ్ మాస్ట్స్‌తో విలీనం చేయనున్నారు. వయామ్ నెట్‌వర్క్స్‌లో టాటా టెలి సర్వీసెస్‌కు 54 శాతం వాటా, కోల్‌కతాకు చెందిన శ్రేయి గ్రూప్ కనోరియా కుటుంబానికి 19 శాతం చొప్పున వాటాలున్నాయి. శ్రేయి గ్రూప్ నుంచి మొత్తం వాటాను, టాటా టెలిసర్వీసెస్ నుంచి 20 శాతం వాటాను, ఇంకా ఇతర వాటాదారుల నుంచి కూడా కలుపుకొని, మొత్తం మీద 51 శాతం వాటాను ఏటీసీ కొనుగోలు చేయనున్నది. ఈ క్యూ1లో వయామ్ కంపెనీ రూ.5,000 కోట్ల అద్దె, నిర్వహణ ఆదాయాలను ఆర్జించింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి ఈ కంపెనీ రుణభారం రూ.5,800 కోట్లుగా ఉంది. టాటా టెలిసర్వీసెస్ మొబైల్ టవర్ల విభాగం, శ్రేయి గ్రూప్‌కు చెందిన క్విప్పో టెలికాం సంస్థలు విలీనమై 2009లో వయామ్ నెట్వర్క్స్ ఏర్పడింది.