breaking news
Venusriram director
-
ఎంసీఏ అంటే... మిడిల్ క్లాస్ ఆడియన్స్
నాని, సాయి పల్లవి జంటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘ఎంసీఏ’. ఈ నెల 21న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను చిత్రబృందం వరంగల్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ– ‘‘వేణు నాకీ కథ చెప్పగానే మీరంతా గుర్తొచ్చారు. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి, అమ్మాయికి తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా మొత్తం వరంగల్‌లోనే చిత్రీకరించాం. ఈ సినిమాతో సాయి పల్లవి నా ఫేవరెట్ కో–స్టార్ అయిపోయింది. ‘దిల్’ రాజుగారు, దేవిశ్రీ ప్రసాద్‌లతో సినిమా చేద్దాం అనుకుంటూ ఉన్నా. ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు చేసేశాం’’ అని అన్నారు. ‘‘వేణుగారు చాలా కష్టపడి తెరకెక్కించారు. నాని చాలా హార్డ్ వర్కింగ్. ప్రతి సీన్‌ను ఇంప్రూవ్ చేయటానికి తపిస్తుంటారు. రాజుగారికి, శిరీష్‌గారికి థ్యాంక్స్’’ అని సాయి పల్లవి అన్నారు. మిడిల్ క్లాస్ అంటే అమ్మాయో, అబ్బాయో కాదు మిడిల్ క్లాస్ ఆడియన్స్. మిడిల్ క్లాస్ అంటే ఒక మైండ్ సెట్. మిడిల్ క్లాస్ అందరికీ నచ్చుతుంది. నాని వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది. అందరికీ థ్యాంక్స్’’ అన్నారు వేణు శ్రీరామ్. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్, ఆలూరి రమేష్ పాల్గొన్నారు. -
పదేళ్ల తర్వాత...
రవితేజ కెరీర్లో ‘భద్ర’ చిత్రానికి ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. రవితేజ హీరోగా ‘దిల్’ రాజు నిర్మించిన ఆ చిత్రం విడుదలై పదేళ్లయ్యింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రవితేజతో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘ఎవడో ఒకడు’ దసరా రోజున హైదరాబాద్‌లో ఆరంభమైంది. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణుశ్రీరామ్ దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘అనుపమా పరమేశ్వరన్ ఓ కథానాయిక. మరో కథానాయిక ను ఎంపిక చేయాల్సి ఉంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. 2016 సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, డైలాగ్స్: రమేశ్-గోపి, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, సహ-నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.