Venkata Krishna Reddy
-
నాకు కోపం వస్తే.. ఎవరికైనా చెంప పగులుద్ది
కావలి టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి నియంత పాలనకు తెర తీశాడు. ఈ మాట సాక్షాత్తు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు బహిరంగ సభలోనే అంటూ ఎమ్మెల్యే తీరును ఆక్షేపించారు. కాలం కలిసొచ్చి శాసన సభ్యుడైన ఆయన పాలన గాలికి వదిలేశారు. సొంత రాజ్యాంగంతో కక్షల రాజకీయం నెరుపుతూ తరచూ వివాదాస్పదమవుతున్నారు. జర్నలిస్టుల నుంచి.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలనే కాకుండా తన గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పోరాడిన సొంత పార్టీ నేతలపైనే కేసులు కట్టించి వేధించిన చరిత్రను మూటగట్టుకున్నారు. తాజాగా తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమని గట్టిగా అడగడమే నేరంగా సొంత పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టారు.సాక్షి నెల్లూరు: రాజకీయాలకు, శాసనసభలకు వన్నె తెచ్చిన ఎందరో ఉద్దండ పాలకులు ఏలిన కావలిలో ప్రస్తుతం డిక్టేటర్ పాలన సాగుతోంది. ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) వ్యవహార శైలి తరచూ వివాదాస్పదమవుతోంది. సామాన్య కుటుంబ స్థాయి నుంచి రూ.వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఆయన మండల స్థాయి నేతగా ఉంటూ గత ఎన్నికల సమయంలో డబ్బు సంచులతో టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. అడ్డదారిలో అధికారం దక్కడంతో కన్ను మిన్ను కానక అరాచక పాలనకు తెర తీశారు. ఆయన మాటే శాననంగా సాగించే క్రమంలో నిరంకుశత్వ ధోరణితో వ్యవహరిస్తూ చెలరేగిపోతున్నారు. అక్రమ కేసులు, అరెస్ట్‌లే పాలనగా.. ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి రెండేళ్లుగా పాలన గాలికి వదిలేసిన.. అక్రమ కేసులు, అరెస్ట్‌లు, విధ్వంసాలు, అరాచకాలే ప్రామాణికంగా సాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రావెల్, మట్టి తవ్వకాల్లో మునిగిపోయారు. ఆయన అక్రమాలను ప్రశ్నించిన నలుగురు జర్నలిస్టులతోపాటు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, ముఖ్యనేతలపై విధ్వంసం కేసును మోపారు. జర్నలిస్టులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి తన నియంతృత్వాన్ని ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులతో దౌర్జన్య కాండను సృష్టించారు. రుద్రకోట వద్ద గ్రావెల్ అక్రమ తవ్వకాలను వీడియోలు, ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను ఆయన మనుషులు ఓ ఇంట్లో నిర్బంధించి కొట్టి బెదిరించే స్థాయికి వెళ్లారు. ఎమ్మెల్యే పాలనా వైఫల్యాలపై ప్రశ్నిస్తూ సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేసిన జర్నలిస్టులపైనా కేసులు కట్టించారు. వైఎస్సార్సీపీ నేతలపైన అయితే లెక్కలేనన్ని కేసులు పెట్టించారు. బోగోలు మండలం కోళ్లదిన్నెకు చెందిన వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నేతలు దాడులు చేస్తే వారిపై కేసులు కట్టకుండా బాధితులపైనే కేసు నమోదు చేయించారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. ఏకంగా ఆస్పత్రిలోకి వెళ్లి మరోసారి టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. అయినా టీడీపీ నేతలపై కేసుల్లేవు.మనీ స్కామ్‌లోనూ వాటాలపై ఆరోపణలు ముసునూరు కేంద్రంగా రూ.వందల కోట్ల మనీస్కామ్‌లో ఎమ్మెల్యేకు వాటాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధపడిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డిని సైతం తన స్థాయిని మరిచి అసభ్యపదజాలంతో మీడియా ముఖంగా దూషణలకు దిగడంతోపాటు ఓ రేంజ్లో రెచ్చిపోవడం రాజకీయంగా కావ్య కృష్ణారెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలపైనా అరాచకం నియోజకవర్గంలో సొంత పార్టీలో తనకు పోటీ ఉండకూడదని తన గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన మాలేపాటి సుబ్బానాయుడు, ముసునూరుకు చెందిన శ్రీహరినాయుడు వంటి కీలక నేతలపై కేసులు కట్టించారు. సొంత పారీ్టలో వర్గ విభేదాలు సృష్టించి వర్గ రాజకీయాలకు మరింత ఆజ్యం పోశాడన్న ఆరోపణలున్నాయి. ఆది నుంచి రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్న కావ్య ఎన్నికల సమయంలోనే టీడీపీ సీనియర్ నేత మన్నవ రవిచంద్రను అడ్డం వస్తే గొడ్డలితో నరికేస్తానంటూ బెదిరించిన ఘటన అప్పట్లోనే సంచలనం సృష్టించింది. కావలి సీటు ఇప్పించేందుకు సహకరించి ఎమ్మెల్యే విజయానికి సహకరించిన బీద రవిచంద్రతో అమీతుమీకి సిద్ధపడ్డాడు. ఆయన అనుచర వర్గాన్ని టార్గెట్ చేసి వారికి చుక్కలు చూపించాడు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ జెండా మోసి డబ్బు సంచుల తూకంలో వెనకబడి సీటు త్యాగం చేసిన మాలేపాటి సుబ్బానాయుడు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడన్న సంగతి తెలిసిందే. మాలేపాటిపై అక్రమ కేసులు నమోదు చేసి అధిష్టానం వద్ద చీవాట్లు తిన్నట్లు ప్రచారంలో ఉంది. మానసికంగా వేధింపులతో చివరకు మాలేపాటి ప్రాణాలు కోల్పోవడంతో ఎమ్మెల్యేపై సొంత పార్టీలోనే తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో పాటు ఆయన్ను అడ్డుకున్న విషయం తెలిసిందే. ముసునూరు చెందిన శ్రీహరినాయుడు ఓ సమస్య చెప్పుకునేందుకు వెళ్లిన సమయంలో బూతులు తిట్టినట్లుగా ఆయన స్వయంగా మాలేపాటి సంతాపసభలో చెప్పుకున్న సంగతి తెలిసిందే. స్వపక్షంలోనే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన్ను పార్టీ దూరంగా పెట్టింది. కావలి పెత్తనాన్ని బీద చేతుల్లో పెట్టింది.సీఎం చీవాట్లు పెడచెవినఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరు రాష్ట్ర స్థాయిలో ఆయనకు 107వ స్థానం ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు చీవాట్లు పెట్టారు. వారం క్రితం కావలికి వచ్చిన సందర్భంలో చంద్రబాబు పార్టీ కేడర్ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మూడు శాఖల పనితీరు ఆధ్వానంగా ఉంటే.. కావలి నియోజకవర్గంలో 11 శాఖల పనితీరు దారుణంగా ఉందని, ఇదేనా నీ పనితీరు అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఫెయిల్ అంటూ తలంటిపోశారు. ఓ పదిమందితో రాజకీయం చేస్తున్నావంటూ, ఇది మంచి పరిణామం కాదని, పార్టీలో అందరిని కలుపుకుపోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. సీఎం హెచ్చరించి ఐదు రోజులు గడవక ముందే.. మంచినీళ్లు అందించండంటూ కావలి మండలం చలంచర్ల పంచాయతీకి చెందిన కిషోర్ అనే టీడీపీ కార్యకర్త తన గ్రామస్తులతో వెళ్లి ఎమ్మెల్యేకు మొర పెట్టుకుంటే.. చెంపలు వాయించడం ఇప్పుడు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్‌టాపిక్ చర్చగా నడుస్తోంది. పార్టీ కేడర్‌ను కలుపుకుని పోవాలని ఆదేశిస్తే.. చెంపలు పగులగొట్టి కొత్త వివాదానికి తెరతీయడంపై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
Venkata Krishna : ముచ్చురామిలో YSRCP కార్యకర్త పొలంలో జనసేన విధ్వంసం
-
ఎవరిది డైరెక్షనో, ఎవరిది యాక్షనో అందరికీ తెలుసు
పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎల్లో మీడియా అవాస్తవ కథనాలను వండి వారుస్తోందని ఆయన పీఏ మూలి వెంకట కృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తుండటం చూసి తాను మీడియా ఎదుటకు వచ్చానని చెప్పారు. ఈ కేసులో వాస్తవంగా ఎవరు డైరెక్షన్ చేస్తున్నారో, ఎవరు యాక్షన్ చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ‘వివేకా చనిపోయిన రోజు నాకు ఒక లెటర్ దొరికితే, ఆ విషయం నేను నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తెలిపాను. దాన్ని దాచిపెట్టమని ఆయన చెప్పగా.. పోలీసులతో ప్రాబ్లమ్ అవుతుందన్నాను. నీకెందుకు.. నేను చూసుకుంటానని ఆయన గట్టిగా చెప్పగా.. వారి ఉప్పు తిన్న విశ్వాసంతో లెటర్ దాచి పెట్టాను. నాతో ఆ పని చేయించిన ఆయన బయట ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ఆయన చెబితే ఆ పని చేసిన నన్ను ఇరికించారు. ఎల్లో మీడియా ఈ వాస్తవాలను మాత్రం రాయదు.. చూపదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. మా ఫోన్ల ఆధారంగా విచారించాలి⇒ అప్పట్లో నన్ను డీటీసీలో పోలీసులు బాగా కొట్టారు. రిమాండ్‌కు పంపించారు. 90 రోజుల తర్వాత నాకు బెయిల్ వచ్చింది. కొద్ది రోజుల తర్వాత కేసును సీబీఐ హ్యాండోవర్ చేసుకుంది. వారు ఎప్పుడు పిలిచినా వెళ్లి సహకరించాను. 2021 మార్చి 3న ఢిల్లీ నుంచి అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీపక్ కౌర్ నుంచి నోటీసు అందుకున్నాను. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పారు. ఇలా జరుగుతుందని రాజశేఖర్ నాకు ముందుగానే చెప్పారు. అంటే వారికి ముందే ఈ విషయం తెలిసి నాతో డ్రామాలాడారని తర్వాత తెలిసింది. ⇒ నేను ఢిల్లీ వెళ్లడానికి రాజశేఖర్ విమానం టిక్కెట్ ఏర్పాటు చేసి, అక్కడ ఉండటానికి వసతి కూడా కల్పించారు. ఖర్చుల కోసం నా అకౌంట్లో రూ.50 వేలు జమ (పాస్‌బుక్ జిరాక్స్ చూపారు) చేశారు. పులివెందుల ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లోని నాలుగో సూట్ రూంలో రాంసింగ్ మేము చెప్పినట్లు విని రంగన్న, దస్తగిరి బయటపడ్డారని.. నువ్వు కూడా నేను చెప్పినట్లుగా అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని నన్ను కొట్టారు. నొప్పి తట్టుకోలేక కేకలు వేశాను. ఆ అరుపులను బయటున్న ఈసీ సురేంద్రనాథరెడ్డి విన్నారు.ఇప్పుడు వాటికి సాక్ష్యాల్లేవంటున్నారు. ⇒ కడప సెంట్రల్ గెస్ట్ హౌస్ కేంద్రంగా రాంసింగ్ నా కుమారుల ఎదుటే నన్ను కొట్టారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. వీటికీ సాక్ష్యాలు లేవంటున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు వారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడంటున్నారన్నారు. వారి వద్ద పనిచేసే వ్యక్తి వారికి అనుకూలంగా చెప్పకుండా నా తరఫున చెబుతాడా? 2021 అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్‌లో ఉన్న నా కుమారుడిని సునీత, రాజశేఖర్‌లు పిలిపించుకుని ‘మీ నాన్న రాంసింగ్ చెప్పినట్లు వినాలి. అందుకు నువ్వు ఎలాగైనా ఒప్పించాలి’ అని తీవ్రంగా ఒత్తిడి చేశారు. ⇒ దీంతో నేను ఆ రాత్రే బయలుదేరి 18నహైదరాబాద్కు వెళ్లాను. పాత ఆఫీస్‌కు కాకుండా కొత్త ఆఫీసుకు (ఇక్కడ సీసీ కెమెరాలు లేవు) రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్లాక రాంసింగ్ చెప్పినట్లు వినాలని సునీత నాపైఒత్తిడి తెచ్చారు. నేనేమో ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నాను. మనం చెప్పినట్లు కృష్ణారెడ్డి వినకపోతే నువ్వు జైలుకు వెళతావని సునీత.. రాజశేఖర్‌తో అనడంతో ఈ హత్యలో వారి ప్రమేయం ఉన్నట్లుగా నాకు అనుమానం వచ్చింది. మా అందరి ఫోన్ల ఆధారంగా విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి.నేను వేసిన కేసును కొట్టేయించుకోవడానికి పాట్లు⇒ ఆ పరిస్థితిలో సునీత, రాజశేఖర్, రాంసింగ్‌లు నన్ను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు పట్టించుకోకపోతే అప్పటి ఎస్పీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశాను. అయినా స్పందన లేనందున పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లయింట్ వేశాను. కోర్టు ఆదేశాల మేరకు అప్పటి సీఐ రాజు స్వయంగా మా ఇంటికి రెండుసార్లు వచ్చి నాతో 20 పేజీల స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు రాజు అసలు విచారణే చేయలేదని చెబుతున్నారు. ఇందులో పోలీసు అధికారులైన రాజేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డిలకు ఎటువంటి సంబంధం లేదు. నేను అవినాష్‌తో మాట్లాడినట్లు నిరూపించాలి. సునీత, రాజశేఖర్‌లు నన్ను బెదిరించలేదని, రాంసింగ్ నన్ను కొట్టలేదని తిరుమల/కాణిపాకం/ఏ చర్చిలో అయినా సరే వారు ప్రమాణం చేస్తే నేను ఈ కేసును విత్‌డ్రా చేసుకుంటాను. ⇒ నేను వేసిన కేసును క్వాష్ చేసుకోవడానికి అప్పట్లో సునీత, రాజశేఖర్, రాంసింగ్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కింది కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. తర్వాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంతలో కూటమి ప్రభుత్వం రావడంతో కేసు కొట్టేయించుకోవాలని సునీత.. చంద్రబాబును, హోం మంత్రి అనితను ఆశ్రయించారు. (అందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు చూపారు). -
కావలి నియోజకవర్గ టీడీపీ నేతలు జూద శిబిరం నిర్వహణ!
-
మా పార్టీ జోలికొస్తే సహించం
ఒంగోలు: మిత్రపక్షంగా ఉంటారో...వెళతారో అనేది మీరే తేల్చుకోండి...అంతే తప్ప మిత్రపక్షం అంటూ మా పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే మాత్రం సహించేది లేదంటూ టీడీపీ నాయకులను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులివెంకట కృష్ణారెడ్డి హెచ్చరించారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీని మిత్రపక్షంగా భావించి తాము మౌనంగా ఉంటున్నా టీడీపీ నాయకుల వ్యవహారశైలి ఆక్షేపణీయంగా ఉంటుందన్నారు. త్రిపురాంతకం ఎంపీపీ నీలం చెన్నమ్మ ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిందని, దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ సీఈవో నిర్ణయం వెలువరించారన్నారు. దీనిపై హైకోర్టులో సవాల్ చేసి తిరిగి ఆమె త్రిపురాంతకం ఎంపీపీగా కొనసాగుతున్నారన్నారు. తాజాగా జరుగుతున్న జన్మభూమి–మా వూరు కార్యక్రమంలో ఆమెను ఖాతరు చేయకుండా ఆమె మాట్లాడుతుంటే మైక్ సైతం లాక్కోవడం, ఎంపీడీఓవో మాణిక్యాలరావు అయితే ఏకంగా టీడీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే సామాజిక తనిఖీ బృందం రూ.14 కోట్ల అవినీతి జాతీయ ఉపాధిహామీ పథకంలో చోటు చేసుకుందని తేల్చిందన్నారు. అంతే కాకుండా మరుగుదొడ్లలో కూడా రూ.2 కోట్ల అవినీతి చోటుచేసుకోవడంతో దానిపై చెన్నమ్మ ప్రశ్నించారన్నారు. అక్కడి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు చెప్పినట్లుగా నడుస్తూ ఎంపీపీ పట్ల నిర్లక్ష్యంగా ఎంపీడీవో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన ఎంపీడీవో మాణిక్యాలరావును తక్షణమే సస్పెండ్ చేయాలని, అక్కడ జరిగిన అవినీతి నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో నాలుగు రోజుల్లో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, ఈ విషయమై ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధిష్టానంతోపాటు, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా హాజరవుతారని ఆశిస్తున్నామని, అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతూ త్వరలోనే కనిగిరి నుంచి వెలిగొండ ప్రాజెక్టు వరకు పాదయాత్ర కూడా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఎంపీపీ నీలం చెన్నమ్మ మాట్లాడుతూ అవినీతిపై గళం ఎత్తుతున్నందుకే తమను బీజేపీలో ఉన్నా హీనంగా చూస్తున్నారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రిజర్వుడు నియోజకవర్గాన్ని కేటాయిస్తే అక్కడ ఎమ్మెల్యే అయి పార్టీ మారిన డేవిడ్‌రాజు, దళిత ఎంపీపీ పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. కోఆప్షన్ సభ్యుడు నీలం లాజర్ మాట్లాడుతూ బీజేపీ ఉనికినే లేకుండా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే తాము జిల్లా అధ్యక్షుడ్ని కలిసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు బొద్దులూరి ఆంజనేయులు, ముదివర్తి బాబూరావు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు సరిచేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన అనంతసాగరం మండలం బి. అగ్రహారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటకృష్ణారెడ్డి(28) అనే వ్యక్తి ఇంట్లో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఏం జరిగిందో చూడటానికి ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మంచినీటి సమస్యపై దృష్టి
ఏజెన్సీలో 131 పాఠశాలల్లో సదుపాయానికి ప్రతిపాదనలు పాఠ్యపుస్తకాల బాధ్యత హెచ్‌ఎంలదే అందలేదని ఫిర్యాదు వస్తే చర్య డీఈఓ వెంకటకృష్ణారెడ్డి చోడవరం/మాడుగుల : పాఠశాలల్లో మంచినీటి సమస్యపై ప్రత్యేక దృష్టిసారించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే పాఠ్యపుస్తకాలు అందలేదని ఎక్కడి నుంచైనా ఫిర్యాదు వస్తే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామ హెచ్చరించారు. శనివారం చోడవరం, మాడుగుల మండలాలలో ఆయన పర్యటించారు. చోడవరం జెడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, మంచినీరు, సైన్స్‌ల్యాబ్, పాఠశాల ఆవరణ పరిశీలించారు. మాడుగుల ఆర్సీఎం బాలికోన్నత పాఠశాలలో పాడేరు డివిజన్ పరిధిలోని హెచ్ఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలో 131 పాఠశాలల్లో మంచి నీటి సమస్య ఉందని గుర్తించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ప్ర తిపాదనలు పంపామన్నారు. ఈసారి జూన్ 7 నాటికే జిల్లాలో 24 లక్షల 67 వేల 263 పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. మరో 28 వేల పుస్తకాల కొరత ఉందన్నారు. పంపిణీ చేసిన పుస్తకాలు అందించే బాధ్యత హెచఎంలదేనన్నారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇందుకు ఎస్ఎంసీ నిధులు వినియోగించాలనిహెచ్ఎంలకు సూచించారు. టెన్త్‌లో గత విద్యా సంవత్సరంలో 90.80 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈ విద్యా సంవత్సరంలో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఎకడమిక్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. 1718 ఉపాధ్యాయ ఖాళీలు జిల్లాలో 1718 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీఈఓ చెప్పారు. ఇందులో 219 బ్యాక్లాగ్ పోస్టులన్నారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు 163 పాఠశాలలు అప్‌గ్రేడ్ చేసినట్లు చెప్పారు. ఏజెన్సీలో 26 కొత్త పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో ఆర్వీఎం పథకంలో 65 పాఠశాలలకు కొత్త భవనాలు మంజూరయ్యాయని, రెండో విడతలో 21 భవనాలు మంజూరయ్యాయని చెప్పారు. వీటిలో 15 భవనాలు పూర్తికాగా మిగిలినవి అసంపూర్తిగా ఉన్నట్లు చెప్పారు. మూడో విడతలో 151 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 1674 పాఠశాలల్లో వంటషెడ్లు జిల్లాలో 4174 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1674 పాఠశాలకు వంటషెడ్లు ఉన్నాయని డీఈఓ చెప్పారు. తొలివిడతలో మ రో 1605 పాఠశాలలకు షెడ్లు మంజూరు చేశామని, వీటిలో 675 పూర్తయ్యాయన్నారు. రెండో విడత 868 షెడ్లకు రూ.1.5 లక్షలు చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం అందేలా కృషి చేస్తానన్నారు. విద్యార్థి స్థాయినబట్టి బోధన ఉండాలి విద్యార్థుల గ్రాహక స్థాయిని బట్టి బోధన చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా విద్యనందించాలని డీఈఓ ఎం.వెంకటకృష్ణారెడ్డి సూచించారు. మాడుగుల ఆర్సీఎం బాలికోన్నత పాఠశాలలో పాడేరు డివిజన్ పరిధిలోని హెచ్ఎంలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజుకో సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో హెచ్ఎంలతో కలిసి ఉపాధ్యాయులంతా టీమ్‌గా ఏర్పడి పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బోళెం సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
వర్ష బాధితులను ఆదుకుంటాం..
గుంటూరు సిటీ, న్యూస్‌లైన్: గత నెల, రెండు రోజులగానూ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం ఆయన ఇన్చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్, వివిధ శాఖల అధికారులతో బాధితులకు అందించిన సాయంపై సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెలలో వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 3,330 ఇళ్లు దెబ్బతినగా, రూ.91.29 లక్షలు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఒక్కొక్క కుటుంబానికి వంట సామగ్రికి రూ.2,500, దుస్తుల కొనుగోలుకు రూ.2,500 అందించినట్లు చెప్పారు. హెలెన్ కారణంగా జిల్లాలో 10 వేల హెక్టార్లలో వరి దెబ్బతిందని తెలిపారు. నాలుగు మండలాల్లో ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి రెండువేల మందిని తరలించినట్లు చెప్పారు. రాష్ట్ర విభజనపై పునరాలోచించాలి.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కేంద్రం పునరాలోచించాలని మంత్రి కాసు కోరారు. రా్రష్ట విభజన వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో చేసే ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందని తెలిపారు. రాష్ర్ట సమైక్యతకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం మారతారని ఇటీవల వచ్చిన ప్రచారాల్లో వాస్తవం లేదన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ఉన్నారు. -
రేపు సమైక్య శంఖారావం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో ఆదివారం సమైక్య శంఖారావ సభను నిర్వహించనున్నట్లు డాక్టర్ వైఎస్ఆర్ స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఉపాధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి, కోశాధికారి రాకేశ్ రెడ్డి, మహిళా కార్యదర్శి బత్తుల అరుణాదాస్‌తో కలసి శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్య శంఖారావాన్ని పురస్కరించుకుని స్థానిక విద్యారణ్యపురలోని కొడగు సమాజ భవనం ఆవరణలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ధర్నానుద్దేశించి ప్రవాసాంధ్ర ప్రముఖులు ప్రసంగిస్తారని తెలిపారు. సమైక్య ఉద్యమానికి ఇది కేవలం సన్నాహకం మాత్రమేనని, నగరంలోని ఇతర తెలుగు సంఘాలతో కలసి ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించనున్నామని చెప్పారు. 2009లోనే సమైక్యానికి అనుకూలంగా ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్‌లో 2009 జరిగిన శాసన సభ ఎన్నికల్లోనే ప్రజలు సమైక్యానికి అనుకూలంగా ఓటేశారని ఆయన గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో మహా కూటమిగా ఏర్పడిన తెలుగు దేశం, టీఆర్ఎస్, వామపక్షాలు తెలంగాణ అనుకూల వాణిని వినిపించాయని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి ఆ మహా కూటమితో పాటు తెలంగాణకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని వివరించారు. ఆ ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ఆర్ ప్రవచించిన సమైక్య వాదానికే సీమాంధ్రతో పాటు తెలంగాణలో ఓట్లు పడ్డాయని వివరించారు. కనుక రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసే అధికారం, హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఒక వేళ ఆ ఫలితాలపై ఎవరికైనా ఏవైనా అనుమానాలుంటే 2014 మేలో జరగాల్సిన శాసన సభ ఎన్నికలను ‘సమైక్యం-విభజన’ ప్రధానాంశంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఇచ్చే తీర్పునకు ఎవరైనా కట్టుబడి ఉండాలని సూచించారు. అంతవరకు ఆంధ్రప్రదేశ్ విభజనను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని మనమంతా సమైక్యంగా ఉంచలేకపోతే భావి తరాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సమైక్య శంఖారావం సభ నిర్వహణలో ప్రధాన పాత్రను పోషించనున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ప్రవాసాంధ్రులు కూడా పాల్గొన్నారు.


