breaking news
vehicles seized by the police
-
లాక్డౌన్ కట్టుదిట్టం..14వేల వాహనాలు సీజ్
సాక్షి, హైదరాబాద్: కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టగా అమలు చేస్తున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైబరాబాద్ పరిధిలో 36 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని.. అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో 14వేల వాహనాలను సీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు. అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తున్నామని తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను కూడా సీజ్ చేస్తామని సీపీ హెచ్చరించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. -
వెయ్యి కిలోల గంజాయి పట్టివేత
విలువ రూ.అరకోటి పైనే... రెండు వాహనాలు సీజ్ ఆరుగురికి రిమాండ్ మరొకరు పరార్ మాడుగుల : జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ఆగడంలేదు. ఎక్సైజ్ అధికారుల ఉదాసీనత పుణ్యమాని రోజూ ఏదో ప్రాంతంలో గంజాయి పట్టుబడుతూనే ఉంది. తాజాగా పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు ఓ వ్యాను, మరో జీపులో తరలిస్తున్న సుమారు వెయ్యి కిలోల గంజాయిని మాడుగుల పోలీసులు పట్టుకున్నారు. మాడుగుల ఎస్ఐ తేజేశ్వరరావు కథనం ప్రకారం.. పాడేరు నుంచి వడ్డాదికి జీపుతోపాటు వ్యానులో గంజాయి బస్తాలు తరలిస్తుండగా, ముందస్తు సమాచారం మేరకు మాడుగుల మండలం గరికబంద చెక్‌పోస్టు వద్ద మాటువేసి పట్టుకున్నారు. తొలుత వ్యానును ఆపి తనిఖీ చేసి వదిలిపెట్టినా, చివరి క్షణంలో అనుమానం వచ్చి క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో వ్యానులోపలి భాగంలో, క్యాబిన్‌కు-తొట్టెకు ఆనుకుని ఉన్న రేకు వద్ద ప్రత్యేకంగా రూపొందించిన అరలో దాచిన గంజాయి బస్తాలను గుర్తించారు. మరో పావుగంట సమయం తర్వాత అదే మార్గంలో వచ్చిన ప్రైవేటు జీపును గంజాయి బస్తాలతో సహా పట్టుకున్నారు. వ్యాను చింత నిప్పుల అగ్రహారం గ్రామానికి చెందిన పొలిమరశెట్టి నాగరాజుదని, జీపు వడ్డాదికి చెందిన లోవ అనే వ్యక్తిదని ఎస్ఐ తేజేశ్వరరావు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న ముద్దాయిలు చింతనిప్పుల అగ్రహారం గ్రామానికి చెందిన శిలపరశెట్టి నాగరాజు, షేక్ అస్లాంభాషా, శిలపరశెట్టి రమణబాబు, బైలపూడి గ్రామానికి చెందిన గాడి అప్పారావు, జి. మాడుగులకు చెందిన ఒంతాలపెద్దబ్బాయి, పెదబయలు కు చెందిన వంచరంగి చిన్నాల దొరలను అరెస్టు చేసిర రి మాండుకు తరలించామన్నారు. మరో ముద్దాయి పొలిమరశెట్టి శ్రీను పరారీలో ఉన్నారని, పట్టుబడిన గంజాయి సుమా రు రూ 50 లక్షలు విలువ ఉంటుందనిఎస్‌ఐ తెలిపారు.